విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
*సత్ఫలితాలిస్తున్న “ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ జిల్లా ఎస్పీ. ఎస్ శ్రీధర్*
కేవలం నాలుగు 4 నెలలలోనే ముగిసిన కేసు విచారణ-10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష*
*అత్యాచారం, హత్యాయత్నం కేసులో ముధ్ధాయి కి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 13,000/- జరిమానా విధించిన 8వ అదనపు జిల్లా సెసన్స్ కోర్ట్, రాజమండ్రి*
*2023 సంవత్సరం జనవరి నెలలో లో పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామం చింతవారిపేట కు చెందిన భాదితరాలు ఇంట్లో ఒక పోర్షన్ నందు ముద్దాయి పచ్చిమాల శ్రీనివాసరావు ఉంటునట్లు, పిర్యాదికి చెందిన కోడి దొంగతనము జరిగిన విషయమై గొడవ జరిగినట్లు, అంతట ఫిర్యాది భర్త ఎంక్వయిరీ చేసినందుకు, అంతట ముద్దాయి పచ్చిమాల శ్రీనివాసరావు సన్నికల్లు పొత్రముతో ఫిర్యాది భర్త నక్క ధన రాజు తలపై కొట్టి గాయ పర్చి, పిర్యాదిని కూడా కొట్టి తదనతరం అత్యాచారం చేయగా, పిర్యాదికి 40 కుట్లు పడినట్లు, బాధితురాలి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పి.గన్నవరం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్. 25/2023 యూ/ఎస్ 376, 307,354, 354(బి), 326, 323, 506 ఐపీసీ గా కేసు నమోదు చేయగా, అప్పటి అమలాపురం ఎస్ డి పి ఓ వై.మాధవరెడ్డి సమగ్ర దర్యాప్తు చేపట్టి కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది.
**తదుపరి జరిగిన విచారణ నందు 8వ అదనపు జిల్లా సెసన్స్ కోర్ట్, రాజమండ్రి, స్పెషల్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ మారిసెట్టి వేంకటేశ్వర రావు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించగా, కోర్ట్ జడ్జి పి.ఆర్.రాజీవ్ , కేసు విచారణ అనంతరం, ముద్దాయి పై నేరం రుజువు అయినందున,
అత్యాచారంనకు (376 ఐపిీసి) పాల్పడినందుకు ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- రూపాయల జరిమానా,
హత్యాయత్నం(307 ఐపిజసి)పాల్పడినందుకు ముద్దాయికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000/- రూపాయల జరిమానా,
అసబ్యకరముగా ప్రవర్తించినందుకు ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2000/- రూపాయల జరిమానా,
దాడికి పాల్పడినందుకు ముద్దాయికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 1000/- రూపాయల జరిమానా,
గాయము కలుగజేసినందుకు ముద్దాయికి 2 నెలల జైలు శిక్ష,
బెదిరించి నందుకు ముద్దాయికి 1 సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
* ఈ కేసు జనవరి నెలలో రిజిస్టర్ అయ్యి కేవలం నాలుగు నెలల కాలములో మొత్తము ట్రైల్ పూర్తై ముద్దాయికి శిక్ష పడటము జరిగింది. త్వరిత గతిన ఈ కేసులో నిందుతునికి శిక్ష పడడంలో ప్రాసిక్యూషన్ తరపున వాధించిన 8వ అదనపు జిల్లా సెసన్స్ కోర్ట్, రాజమండ్రి, పబ్లిక్ ప్రొసిక్యుటర్ మారిసెట్టి వేంకటేశ్వర రావు ని, దర్యాప్తు అధికారులైన అయిన అప్పటి ఎస్ టి పి ఓ వై.మాధవరెడ్డి ను డా: బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ ప్రత్యేకముగా అబినందించారు.
ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ వల్ల, త్వరితగతిన శిక్షలు పడటము వల్ల సమాజములో ముఖ్యముగా మహిళలలో ఒక విధమైన భద్రతా భావము కలగడానికి దోహదపడిందన్నారు.