విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004 నుండి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పని చేసిన దొమ్మేటి వెంకటేశ్వర్లు. ఈయన హయాంలోనే తాళ్ళరేవు మండలానికి రిలయన్స్ ఫ్యాక్టరీ ప్రారంభం జరిగింది. తాళ్ళరేవు నుండి అభిమానులు కార్యకర్తలు భౌతిక కాయాన్ని దర్శించడానికి తరలి వెళ్లారు. దొమ్మేటి మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు.