విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లాతాళ్ళరేవుమండల పరిధి లోని 216 జాతీయ రహదారి పై జంక్షన్ వద్ద నూతనంగా అక్రమ మద్యాన్ని అరికట్టడానికి కొత్త చెక్పోస్ట్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన యానానికి సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో ఈ జంక్షన్ నుండే ఎక్కువ అక్రమ మద్యం తరలింపు జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో క్వారీగా పోలీసులు స్పెషల్ అండ్ బ్యూరో పోలీసులు కలిసి కట్టుదిట్టమైన భద్రత తనిఖీ ఏర్పాట్లు చేశారు . ఎస్ఐ శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో నూతన చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.