విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా మండలం జాతీయ రహదారి 216 వద్ద గత నెల 14వ తేదీన జరిగిన మోజో ట్రావెల్స్ బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యానం కు చెందిన చింతపల్లి మంగయమ్మను యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటినుంచి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరామర్శించి డాక్టర్లకు మంచి వైద్యం అందు ఇవ్వాలని కోరారు. ఆమె త్వరగా కోలుకోవాలని గొల్లపల్లి ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట యానం నాయకులు ఉన్నారు.