Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సర్పంచ్ పెనుబల్లి నాగమణి , సచివాలయ కన్వీనర్ గొల్లపల్లి శివబాబు
– వాలంటీర్లు ప్రజాసేవలో ఆత్మ సంతృప్తితో పని చేయాలి
– కన్నాయిగూడెం సచివాలయంలో వాలంటీర్లకు వందనం

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్సీ అనంత (బాబు) ఉదయ్ భాస్కర్ , ఎమ్మెల్యే ధనలక్ష్మి సూచనల మేరకు ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం గ్రామ సచివాలయంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ పెనుబల్లి నాగమణి , సచివాలయం కన్వీనర్లు గొల్లపల్లి శివబాబు , కాటిపోయిన నాగరాజు , పంచాయితీ కార్యదర్శి శివకుమార్ ,వైకాపా నాయకులు కోటేశ్వరరావు చేతులు మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగమణి , సచివాలయ కన్వీనర్ గొల్లపల్లి శివబాబు మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని, వాలంటీర్లు సంక్షేమ సేవకులని అన్నారు. 15 ఆగష్టు 2019 వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమ నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని, వారి సేవలు వెల కట్టలేనివని అన్నారు. వాలంటీర్లు అంటే జగనన్న సైనికులు అని, కరోనా సమయంలో కూడా ప్రజలకు ఎంతో విశేష సేవలు చేశారని తెలిపారు. ఇన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు అని చెప్పవచ్చు అని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు కంటే ముందుగా అవ్వా తాతలకు , అర్హులైన ఇతరులకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. జగనన్నకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రిది అని, సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న నిజమైన నాయకుడు అన్నారు. వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర లుగా వారిని సత్కరించడం, నగదు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోందని అన్నారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లకు నిజమైన వందనాలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పెనుబల్లి.బాబురావు , గృహసారథులు భాస్కర్ లింగం , వర్స.భద్రయ్య , విద్యా సంక్షేమ సహాయకులు భూక్యా కిరణ్ , డిజిటల్ అసిస్టెంట్ శైలజ , ఏఎన్.ఎం , అగ్రికల్చర్ అసిస్టెంట్ రవి , ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనిల్ , వెటర్నరీ అసిస్టెంట్ సాయి , మహిళా పోలీస్ మార్తమ్మ , వైకాపా కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement