Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నగదు దొంగలించిన ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న రామచంద్రాపురం పోలీసులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

*ద్విచక్ర వాహనం లో నగదు దొంగిలించిన ముద్దాయిలను పట్టుకున్న పోలీసులు*

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ఆదేశాల మేరకు

 

సబ్ డివిజనల్ అధికారి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ పర్యవేక్షణలో

 

సీఐ వి .దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై డి సురేష్ బాబు దర్యాప్తు చేశారు

 

 

రామచంద్రాపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్:-

 

మాచవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి దారారెడ్డి అను వ్యక్తి తన రైస్ మిల్లులోని రైతులకు డబ్బులు ఇచ్చుట కొరకు రామచంద్రపురం ఎస్బిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంకుల నందు 3,55,000/- రూపాయలు విత్ డ్రా చేసుకుని తన యొక్క హెూండా యాక్టివా మోటార్ సైకిల్ డిక్కి నందు డబ్బులను పెట్టుకుని రామచంద్రపురం పట్టణం మెయిన్ రోడ్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్ళుటకు గాను పార్కింగ్ ప్లేస్ నందు తన యొక్క మోటార్ సైకిల్ పార్క్ చేసి ఎటిఎం వద్దకు వెళ్లగా ఇంతలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతని మోటార్ సైకిల్ డిక్కి నందు ఉంచిన డబ్బులు 3 లక్షల 55 వేల రూపాయలు దొంగతనం చేశారని ఫిర్యాదు పై రామచంద్రపురం పోలీస్ స్టేషన్ నందు సి ఆర్ నెంబర్.172/2023 U/S 379 ఐపీసీ గా కేసు నమోదు చేసి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పి ఎస్. శ్రీధర్ సూచనల మేరకు, రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టిఎస్ ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో, రామచంద్రపురం సిఐ వి. దుర్గారావు ఆధ్వర్యంలో, రామచంద్రపురం ఎస్ఐ డి సురేష్ బాబు దర్యాప్తు చేసి, ఈరోజు అనగా ది. 15.06.2023 వ తేది ముద్దాయిల గురించి సమాచారం పై పసలపూడి వైజంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసి సిటీ 100 మోటార్ సైకిల్ పై మండపేట వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా వారి పేర్లు 1. ముఖేష్ కుమార్ s/o కిషోర్ లాల్, బితురా గ్రామం, గొండ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2. రోహిత్ కుమార్ s/o హరీష్ చంద్ర, బంగై గ్రామం, గొండ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లు అని వారు సీలింగ్ పని నిమిత్తం వచ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన స్నేహితులతో కలిసి మండపేట దగ్గరలోని తాపేశ్వరం వద్ద అద్దె ఇంట్లో ఉంటూ గతంలో పాలకొల్లు, అమలాపురం, మండపేట ఏరియాలో డిక్కీ దొంగతనాలు చేసామని, ఈ నెల 8వ తేదీన రామచంద్రపురం స్టేట్ బ్యాంకు వద్దకు వచ్చి దొంగతనం చేయుటకు డబ్బులు విత్ డ్రా చేయు వ్యక్తులను గమనిస్తూ ఉండగా ఒక వ్యక్తి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేయడం చూసి అతను వెంట పడగా అతను హెన్డిఎఫ్సీ బ్యాంకు వద్ద కూడా డబ్బులు విత్ డ్రా చేసి అతని హెూండా యాక్టివా మోటార్ సైకిల్ డిక్కీలో డబ్బులు పెట్టుకుని యూనియన్ బ్యాంక్ వద్ద పార్క్ చేసుకుని ఏటీఎం వద్దకు వెళ్లగా మేము నకిలీ తాళంతో డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు దొంగిలించినాము అని చెప్పినారు, ఎస్సై వారిని రామచంద్రపురం పిఎస్ డిక్కీ దొంగతనం కేసులో ముద్దాయిలుగా గుర్తించి వారు వద్ద నుండి తాపేశ్వరం రూములో దాచిన దొంగలించిన సొమ్ము మూడు లక్షల 55 వేల రూపాయలను రికవరీ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగినది, ఈ కేసునీ చాకచక్యంగా మరియు త్వరితగతిన ఛేదించిన సీఐ వి దుర్గారావు, ఎస్సై డి సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్స్ వీరబాబు, మల్లిఖార్జునరావు, కానిస్టేబుల్స్ జగదీష్, సూరిబాబు, అనిల్ మరియు హెూంగార్డ్ మహేష్ లను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, ఐపీఎస్

అభినందించినారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement