– సత్వరం పరిష్కరించిన ఎమ్మెల్యే ధనలక్ష్మి
– కృతజ్ఞతలు తెలిపిన వైకాపా నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:
ఎటపాక పంచాయతీలోని పలు సమస్యలను స్థానిక వైకాపా జిల్లా నాయకుల నేతృత్వంలో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి ఆయా శాఖల అధికారులకు ఫోన్ ద్వారా తగు సూచనలు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్టు వైకాపా జిల్లా నాయకులు , ఎటపాక సచివాలయ కన్వీనర్ కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి) మీడియాకు తెలిపారు. చింతూరు , ఏడుగురాళ్లపల్లిలో శనివారం నూతన సచివాలయం , రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను వైకాపా నాయకులు కలిసి ఎటపాక పంచాయతీ సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరించారని తెలిపారు. అందుకు పత్రికాముఖంగా ఎమ్మెల్యే ధనలక్ష్మికు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో వైకాపా మండల నాయకులు శీలం నాగేశ్వరరావు , ఎండియూ ఆపరేటర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు కురినాల విజయ్ కుమార్ , కట్టా ఓంకార్ , కొండ తదితరులు ఉన్నారు