సుంకరపాలెం గ్రామ దేవత
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం సుంకరపాలెంలో కొలువై ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారిని ఆషాడమాసం సందర్భంగా శాకాంబరిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవారిని ఆషాడమాసం సందర్భంగా పండ్లు కాయగూరలతో అమ్మవారిని అలంకరించినట్లు, పలు రకాల పిండి వంటలతో నైవేద్యం చేసినట్లు అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆషాడ మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారని తెలిపారు .