రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం 216 జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనదారుడు యానం వైపు నుండి వస్తూ డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. ప్రమాద వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన యువకుడు గొల్లపాలెం గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు 108 సహాయంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.