Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గుండాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రజాప్రతినిధులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గుండాల ప్రజలను అప్రమత్తం చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు
– గోదావరి వరద ఉధృతి పెరిగింది జాగ్రత్త అవశ్యం
– మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
– పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళండి
– గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి

విశ్వంవాయిస్ న్యూస్, ఎటపాక:

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరిగిందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి , స్థానిక సర్పంచ్ గుండి సీతాలక్ష్మి గుండాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. మండలంలోని గుండాల సచివాలయ పరిధిలోని పాత గుండాల గ్రామంలో గురువారం ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి , స్థానిక సర్పంచ్ గుండి సీతాలక్ష్మి అధ్వర్యంలో తాహాశీల్దార్ వేణుగోపాల్ , పంచాయతీ సెక్రటరీలు వెంకటేశ్వరరావు , నాగేశ్వరరావు , ఉప సర్పంచ్ తోట శశికుమార్ , వాలంటీర్లు , సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రస్తుతం పెరుగుతున్న గోదావరి వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించి , ముందస్తు జాగ్రత్తగా ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల సామాన్లను , పశువులను గుండాల పినపల్లి స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించాలని , ప్రజలందరూ కూడా ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలని వారు సూచించారు. ఈ సందర్భంగా గుండాల ఎంపిటిసి గొంగడి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని , దాంతో ప్రమాదం పొంచి ఉన్నందున , తెలంగాణలో ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల ద్వారా వరదనీరు వస్తుండటంతో గోదావరి ఉధృతి పెరుగుతుందని , ప్రజలందరూ కూడా గోదావరి వరదలు తగ్గేవరకు పునరావాస కేంద్రంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు ఎర్రగొల్ల నరసింహారావు , కాకాని సురేష్ , వార్డు మెంబర్లు , అంగన్వాడి స్టాప్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement