ప్రతిపక్షాలన్నీ కలిసిన మళ్లీ జగన్ సీఎం అవడం ఖాయం వైవి సుబ్బారెడ్డి
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి శనివారం పర్యటన చేశారు. ఈయన పర్యటనలో గోదావరి నది తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలనే అధికారులను సూచించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమైన సీఎం జగన్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమని మీడియా ముందు తెలిపారు. విపత్తుల సమయంలోనూ ఆపదలో సమయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వరద సమయాల్లో కూడా అప్రమత్తం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని అన్నారు. సీఎం జగన్ ప్రజల ఆశీర్వాదాలు పొందిన వ్యక్తి అన్నారు. ఇలాంటి ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తుంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమైన సీఎం జగన్ ను ఓడించడం సులభం కాదన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు పొన్నడ వెంకట సతీష్ కుమార్, తాళ్ళరేవు జడ్పిటిసి సామ్యూల్ సాగర్, ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ తాళ్ళరేవు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.