విశ్వంవాయిస్ న్యూస్, కడియం:
కడియం నర్సరీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
– రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్
– సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్ అసోసియేషన్ కడియం పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా
కడియం రూరల్,విశ్వం వాయిస్ న్యూస్:
సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కడియం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరికరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు.
కడియం మండలం నర్సరీ రైతుల సమస్యలు మరియు సంక్షేమం కొరకు నూతనంగా ఏర్పాటు అయిన సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్ అసోసియేషన్ కడియం పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం కార్యక్రమం బుర్రిలంక పీ. ఎస్.ఎమ్.ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరికరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ కడియం నర్సరీలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందేవిధంగా కష్టపడిన ప్రతీ రైతుకి తన కృతజ్ఞతలు తెలిపారు. పూల తోటలతో పూల వ్యాపారానికి అనువుగా ఉన్న మన నర్సరీలు ఇంకా ముందు ముందు అనేక కీర్తి ప్రతిష్టలు మన మండలానికి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేసారు. కష్టపడే ప్రతీ రైతుకి ఏ కష్టం వచ్చిన ఈ అసోసియేషన్ అండగా నిలవాలని పాలకవర్గాన్ని కోరారు.
కడియం నర్సరీలకు ఎటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత తీసుకుంటాను అని, అలాగే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తాను అని తెలిపారు.పాలకవర్గం ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన మల్లు పోలరాజు ని మరియు పాలకవర్గం సభ్యులని అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యన అధికారి వి. రాధాకృష్ణ,డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జేసీస్ కన్వీనర్స్ ఇంచార్జి తాడలా చక్రవర్తి, పల్లా సుబ్రహ్మణ్యం,కడియపులంక సొసైటీ అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీను, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ దొంతంశెట్టి వీరబద్రయ్య, వివిధ నర్సరీల అధినేతలు తదితరులు పాల్గొన్నారు.