Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వాలంటీర్లను కించపరిచిన పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు, పొరపాట్లు వల్లే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆటంకం

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

వాలంటీర్లను కించపరిచిన పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేయాలి

 

 

– పవన్,లోకేష్ పరిపక్వత లేని నాయకులు

 

-టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు, పొరపాట్లు వల్లే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆటంకం

 

-వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ కార్యదర్శిపి.వి.వి.ఎస్.బి.రాజు

 

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

 

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులు,పొరపాట్లు వల్లే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి పి.వి.వి.ఎస్.బి.రాజు విమర్శించారు. శనివారం రాజమహేంద్రవరంలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం అభివృద్ధి పనులకు తెలుగుదేశం పాలనలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా బంధువులకు కాంట్రాక్టు ఇవ్వడం వల్ల ఆటంకాలు కలిగాయని పి.వి.వి.ఎస్.బి.రాజు విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళా వాలంటీర్లను కించపరిచే విధంగా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహిళా వాలంటీర్లను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్, యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ దొందూ దొందే అన్నట్టుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంట్లో దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులను ఇంట్లోకి పంపించి ముద్రగడ కుటుంబం లోని మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించ లేదని నిలదీశారు. పవన్, లోకేష్ పరిపక్వత లేని నాయకులని రాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో డిజైన్ టెక్ ద్వారా సింగపూర్ కు కోట్లాది రూపాయలు పంపి తర్వాత ఆ నగదును అక్కడి నుంచి టీడీపీ నాయకుల ఖాతాల్లో జమ చేసుకున్నారని ఆరోపించారు ‌అమరావతి భూ కుంభకోణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు.పోలవరం సందర్శనకు మనిషికి 500 రూపాయలు ఖర్చు చూపించి జనాలను ఆర్టీసీ బస్సుల్లో తీసుకు వెళ్ళిన సంఘటనల్లో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు ‌స్కిల్ డెవలప్మెంట్ లో 240 కోట్ల అవినీతికి పాల్పడ్డారని రాజు విమర్శించారు.అమరావతి భూ కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ కుమార్తెను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామ, సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ధృవ పత్రాలు అందించే ఏర్పాట్లు చేశారని రాజు కొనియాడారు. జనసేన, టీడీపీ సచివాలయాలు, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ పై ‌ముస్సోరీ లోని ఐఏఎస్ శిక్షణలో పాఠ్యాంశంగా చేర్చారని,ఇంత గొప్ప వ్యవస్థపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అమరావతి భూ కుంభకోణంపై చర్చించి దీనిపై విచారణ జరిపించాలని రాజు కోరారు.వాలంటీర్లను మోసపూరిత, కుట్రపూరితంగా కించపరిచిన పవన్ కల్యాణ్ పై సెక్షన్ 499,359,310,110 కింద కేసు నమోదు చేయాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement