Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మణిపూర్ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించాలి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఇది పూర్తిగా ఆటవిక చర్య,మతోన్మాద చర్య, సర్వ సమాజం నిలదీయాలి.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

మణిపూర్ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించాలి

 

మణిపూర్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు మౌనం వీడి పోరాటం చేయాలి

 

– ఇది పూర్తిగా ఆటవిక చర్య,మతోన్మాద చర్య, సర్వ సమాజం నిలదీయాలి.

 

– దోషులను కఠినంగా శిక్షించాలి,

మహిళా రక్షణ చట్టాలు కఠినంగా అమలు చెయ్యాలి ,స్త్రీలను గౌరవించాలి

 

– నగర వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు అరిఫుల్లా ఖాన్

 

రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్ :

 

మణిపూర్ లో ఆదివాసి గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి,మణిపూర్ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించాలి అని నగర వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులు అరిఫుల్లా ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 78 రోజులుగా మణిపూర్ ఈ సంఘటన జరిగినా సరే బయటకు ఇప్పటివరకు తెలియకపోవడం

చాలా బాధాకరం,అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తెలియకుండా ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా నిలిపివేసి ఇన్ని రోజులుగా గిరిజన మహిళలపై దాడులు జరిగిన చర్యలు లేకపోవడం బాధాకరం,ఇది పూర్తిగా ఆటవిక చర్య, మతోన్మాద చర్య, సర్వ సమాజం నిలదీయాలి,ఇటువంటి సంఘటనలు హింసాత్మకమైన దాడులు చాలా అమానుషం,ఆదివాసి గిరిజన మహిళల బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగింపు చేయడం వెనకాల అక్కడున్న ఎటువంటి రాజకీయ శక్తులు ఉన్న వెంటనే ఈ దోషులను కఠినంగా శిక్షించి మన భారతీయ వ్యవస్థను కాపాడాలని, మహిళలపై గౌరవంగా ప్రవర్తించాలని, ఇటువంటి సంఘటనలు మరల జరగకుండా పూర్తి బాధ్యతలు వహించాలని ఖాన్ ఒక ప్రకటనలోతెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement