Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులను ఉరితీయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రధాని మోడీ ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని, మతతత్వం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులను ఉరితీయాలి

– గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ డిమాండ్

 

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి,అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులను ఉరితీయాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తూ గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిపి గోకవరం అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై అత్యాచారం చేసి, హత్య చేసిన దోషులను ఉరితీయాలని, ప్రధాని మోడీ ఈ ఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని, మతతత్వం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు వినతి పత్రం సమర్పించారు. గార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ జాతీయ కన్వీనర్ వరదా నాగేశ్వరరావు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునే విధంగా, దుర్మార్గంగా, అతి క్రూరంగా మహిళల పై చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల మద్దతుతోనే ఆదివాసీలపై మారణకాండ జరుగుతున్న దని అన్నారు. ఇటువంటి దారుణ మారణకాండ నివారించకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఆకుల విజయభారతి మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలలపై జరిగిన ఘటన దేశానికే మాయని మచ్చగా మిగులుతుంద న్నారు. మరుకుర్తి రవియాదవ్ మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన మరణ కాండపై గార్డ్స్ సంస్థ చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమని అన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనేది అర్ధం కావడం లేదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రపంచస్థాయిలో అగ్రభాగాన దేశాన్ని నిలబెడతామని చెబుతున్నారని కానీ మణిపూర్ చిన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన కనలేకున్నారని విమర్సించారు. ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన సంఘటన హృదయాలను కలచివేసిందన్నారు. దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దేవలంక పార్వతి, కాటం అమ్మణి,కుడెల్లి రత్నకిషోర్, బొక్కా సింహాచలం ,గుత్తుల వీర వెంకట రమణ, వై. పరశురామ్, ఎలుగుబంట్ల శివ, కొండపల్లి వెంకటరమణ, ఉల్లేటి పుల్లయ్య, నాగళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement