Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఛలో హైదరాబాద్ విశ్వరూప మహాసభ ను విజయవంతం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

లక్షలాదిగా తరలిరావాలని నాయకులు పిలుపు

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం బొమ్మూరు రూరల్:

ఛలో హైదరాబాద్ విశ్వరూప మహాసభ ను విజయవంతం చేయండి

– బొమ్మూరులో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి సమావేశం

– లక్షలాదిగా తరలిరావాలని నాయకులు పిలుపు

రాజమహేంద్రవరం రూరల్, విశ్వం వాయిస్ న్యూస్:

 

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరు గ్రామంలో పాతపేట బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద

శనివారం సాయంత్రం మహాజన సోషల్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గ్రామ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఆగస్టు రెండో వారంలో మాదిగల మహాత్ముడు,ఆరాధ్య దైవం మాన్యశ్రి మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు

జరగబోయే ఛలో హైదరాబాద్ మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాజమండ్రి రూరల్ కన్వీనర్ యార్లగడ్డ సతీష్ ఆధ్వర్యంలో అనంతవరపు వీరేంద్ర మాదిగ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ నాయకులు కొత్తపల్లి ప్రసాద్ మాదిగ,మహాజన సోషలిస్ట్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఇండిగిమెల్లి చిరంజీవి మాదిగ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆగస్టు రెండో వారంలో జరగబోయే హైదరాబాద్ లో మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ఒక బస్సు బయలుదేరాలని, త్వరలో 2 వ వారం ఏతేదీ అనేది ప్రకటన తెలియజేస్తాం ఆని,లక్షలాది మాదిగలతో ఈ సభను విజయవంతం చేయాలని వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పెనుముచ్చి సురేష్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు బుర్రా సంతోష్ మాజీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బాదంపూడి చిట్టి రాజు మాదిగ అనంతావరపు యేసురాజు ముప్పడి రాము వేమగిరి డేవిడ్ తాతపూడి గోవిందరాజు,దాసరి ఫణి బాబు,పైడిమల్ల ఇస్సాకు,యార్లగడ్డ సునీల్ అనంతవరపు గోపి,యల్లమెల్లి రమేష్ ఇండిగిమెల్లి సురేష్ దాసరి కిరణ్ పలవెల పండు కోడి రొమేష్ మరియు బాబు జగ్జీజీవన్ రామ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement