—– మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు
విశ్వంవాయిస్ న్యూస్, మలికిపురం:
రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ లు 205 మందికి ఆదివారం ఐ.డి కార్డులను అందజేశారు. లక్కవరం గ్రామం యం జి గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ గ్రామాలలో బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ పరిశీలన కార్యక్రమంలో 205 మంది బూత్ ఏజెంట్లు తమ ఐ డి కార్డు తో పాల్గొనాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎన్ని ఇండ్లను సందర్శించారు, ఎంతమంది ఓటర్లను విచారించారు. ఫారం 6 ద్వారా ఎన్ని కొత్త ఓట్లకు దరఖాస్తులు స్వీకరించారు. ఫారం 7 ద్వారా ఎన్ని ఓట్లు తొలగించటానికి దరఖాస్తులు స్వేరకరించారు ఫారం 8 ద్వారా ఇల్లు మారిన వారివి, తప్పులు ఉన్న వారివి ఎన్ని దరఖాస్తులు స్వీకరించారో ఎప్పటికప్పుడు వివరాలు వ్రాసుకుని తెలియజెయ్యాలని సూచించారు. గ్రామం నుండి శాస్వితంగా వెళ్ళిపోయిన వారు, మరణించిన వారిని తప్పనిసరిగా ఓటర్ లిస్ట్ నుండి తొలగించటానికి చర్యలు తీసుకోవాలని బూత్ ఏజెంట్ లకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ముదునూరి చినబాబు రాజు, అడబాల యుగంధర్, ముప్పర్తి నాని, చాగంటి స్వామి, తాడి సత్యనారాయణ, బోనం సాయిరాం, ముదునూరి రాంబాబు రాజు, అల్లూరి మోహన్ రాజు, చెల్లింగి లీలా శ్రీనివాస్, బత్తుల రవీంద్రనాద్, కట్టా వెంకటరమణ, రాపాక అనంద్ కుమార్, కోళ్ల జయేంద్ర కృష్ణ, కసుకుర్తి త్రినాధస్వామి, మార్గాని అన్నవరం, ఇల్లింగి వేణు, యెనుముల రమణ, కడలి వెంకటరత్నం, గొణిపాటి రాజు, కొమ్మోజు హరీష్ మాష్టారు, దొడ్డా సుబ్బారావు, యెనుముల నాగు, బోనం చంటి, కటికరెడ్డి గోపాలకృష్ణ,గుడాల విశ్వనాధం, వలవల శేఖర్, అడబాల సత్యరమేష్, అడబాల చంటి, యాండ్ర దొరబాబు, పొలమూరి శ్యాంబాబు, అడబాల విజయ్, కాండ్రేగుల రాము, నాగిరెడ్డి గోపీ మరియు బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.