విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రూరల్:
మణిపూర్ సంఘటన దోషులను కఠినంగా శిక్షించాలి
– యునైటెడ్ క్రిస్టియన్ ఫెల్లోషిప్
శాంతియుత నిరసన ర్యాలీ
– హుకుంపేట పిడింగొయ్యి గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన
-యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్
(యు.సి.ఎఫ్ )డిమాండ్
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: మణిపూర్ లో మహిళలపై జరిగిన కిరాతక సంఘటలకు వ్యతిరేకంగా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ (యు.సి.ఎఫ్ ) ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఐక్య క్రైస్తవ సహవాసం హుకుంపేట అధ్వర్యంలో యు.సి.ఎఫ్ లోని హుకుంపేట, పిడింగోయ్యి గ్రామాల్లో వున్న 15 క్రైస్తవ సంఘాలు ఐక్యంగా కలసి మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పై ఘోర హింసలకు నిరసనగా అక్కడ హింసించబడుతున్న కుకీస్,నాగా జాతులకు, ముఖ్యంగా క్రైస్తవులకు మద్దతుగా హుకుంపేట పెడింగోయ్యి గ్రామాలలో నిరసన, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వానికి ఈ శాంతి ర్యాలీ ద్వారా కొన్ని విన్నపాలు చేశారు. మణిపూర్ లో శాంతియుత వాతావరణం ప్రభుత్వం త్వరితగతిన ఏర్పాటు చేయాలని, మత ఛాందసవాదం అరికట్టి ..మతచాందసవాదుల చేతుల్లో మరణించిన కుటుంబాలకు తగిన సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. మణిపూర్ స్త్రీలను వివస్త్రను చేసి ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, అక్కడ కూల్చ బడిన కొన్ని వందల చర్చ్ లను ప్రభుత్వమే తిరిగి పుననిర్మించాలని, మతసామరస్యం పెంపొందించి ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉండాలని. కోరారు…మతచాందస వాదులు చేసిన అరాచకాలు ఇకమీదట జరగకుండా ప్రభుత్వం చూడాలని, హింసను ప్రేరేపించిన ప్రతీ ఒక్కరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..ఈ నిరసన శాంతి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న యు.సి.ఎఫ్ లో వున్న 15 క్రైస్తవ సంఘాల పాస్టర్స్, సంఘసభ్యులు, దళిత క్రైస్తవ నాయకులు నక్క విజయకుమార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రీ సెయింట్ పీటర్స్ చర్చ్ సంఘ పెద్దలు పాల్గొని మద్దత్తు ఇచ్చారు. ఈసందర్భంగా పట్నాల విజయకుమార్ మాట్లాడుతూ మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశానికి రక్షణగా కార్గిల్ లో విధులు నిర్వహిస్తున్న సైనికుడి కుటుంబానికి మణిపూర్ లో రక్షణ లేకుండా పోయిందని,అతని భార్యను కిరాతకంగా చంపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. మణిపూర్ ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.నక్కా విజయకుమార్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పాస్టర్ జి.సామ్యూల్ సందీప్ మాట్లాడుతూ సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరారు. ఈ శాంతి ర్యాలీలో ఐక్య క్రైస్తవ సహవాసంలో వున్న
రూపాంతరం లూథరన్ దేవాలయం పాస్టర్ జి.సామ్యూల్ సందీప్, సంఘ సభ్యులు,యస్.స్వస్థత ప్రార్థన సహవాసం సంఘ సభ్యులు,జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ పాస్టర్ కె.జీవరత్నం, సంఘ సభ్యులు,సిలోయం చర్చ్ సంఘ సభ్యులు,గుడ్ సమర్టియన్ ఆర్మీ పాస్టర్ వి.రవి కుమార్,జీసస్ ప్రేయర్ హౌస్ పాస్టర్ రెవ్ రమేష్,బేతేస్త ప్రార్థన మందిరం పాస్టర్ రెవ్.పి.డానియల్ రాజు, సంఘ సభ్యులు ప్రేయర్ ఫెలోషిప్ పాస్టర్ రవిరజు,సభ్యులు. కల్వరి కృపా సహవాసం సంఘ సభ్యులు,
జీవమమార్గ సంఘం పాస్టర్ రెవ్ డి.సూర్య ప్రభాకర్, సంఘ సభ్యులు,
బ్రదరన్ చర్చ్ పాస్టర్ రేవ్ సి.హెచ్.రాజు,
సియోను ప్రార్థన మందిరం పాస్టర్ బి. నరేష్,చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘ యూత్,
పాస్టర్ రామకృష్ణ,పాస్టర్ వెన్నపు చిన్ని,
జె.సి.జి.ఎం. చర్చ్ పాస్టర్ ఆర్.వినయ్ కుమార్,పెద్దలు బండి నాగేశ్వరరావు, మోకా రాజుబాబు, వెన్నపు సుబ్బారావు, మహిళలు,సమాజాల యువకులు, పిల్లలు,జైహింద్ నగర్ యూత్ పాల్గొని నిరసన తెలిపారు.