విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
విజయ్ దివాస్ ను ప్రతీ ఏటా జులై 26 న దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామనీ దీప్తి విద్యాసంస్థలు కరెస్పాండెంట్ డివివి సత్యనారాయణ అన్నారు. మామిడికుదురు స్థానిక దీప్తి పాఠశాలలో బుధవారం కార్గిల్ విజయ్ దివాస్ ను ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధం లో ప్రాణాలర్పించిన అమరవీరులకు విధ్యార్ధులు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. 1999 జులై 26 న భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం పై విజయం సాదించగా, లడఖ్ లోని కార్గిల్ ప్రాంతంలో 60 రోజులు పైగా జరిగిన ఈ యుద్ధంలో భారతసైన్యం విజయం సాధించిందనీ విద్యార్థులకు వివరించారు. . ఈ కార్యక్రమంలో దీప్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు యక్కలదేవర నాగన్నబాబు , ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.