Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపి స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం ‌రాజమహేంద్రవరం గోదావరి గట్టు న ఉన్న ఈ.పి.డి.సి.ఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ "నల్ల బ్యాడ్జీలు" ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం , తూర్పుగోదావరి జిల్లా:

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

 

– పొరుగు సేవల సిబ్బందిని విద్యుత్ సంస్థలలో విలీనం చేసి, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి

 

– విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్

రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపి స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం ‌రాజమహేంద్రవరం గోదావరి గట్టు న ఉన్న ఈ.పి.డి.సి.ఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులందరూ “నల్ల బ్యాడ్జీలు” ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రాజమహేంద్రవరం టౌన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ డి ఈ నక్కపల్లి సామ్యూల్, రూరల్ డిఈ దాట్ల శ్రీధర్ వర్మ, జేఏసీ చైర్మన్ వివిఎస్ నాగేశ్వరరావు, కో చైర్మన్ పి రామ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జాయింట్ ఏక్షన్ కమిటీ రాష్ట్ర డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశానుసారం విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల బ్యాడ్జీలతో నిరసన రక్తం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని డివిజన్ల యూనియన్లు, అసోసియేషన్ల నుండి పెద్దఎత్తున విద్యుత్ ఉద్యోగులు హాజరై, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని నినదించారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు ఆందోళన విరమించేదిలేదని, రాష్ట్ర మరియు డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశానుసారం నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని సర్కిల్ జే.ఏ.సి నాయకులు పేర్కొన్నారు. కార్మిక చట్టాల ప్రకారం శాశ్వత ఉద్యోగి చేస్తున్న విధులు బాధ్యతలను కాంట్రాక్టు కార్మిక చేసినట్లయితే ఆ కాంట్రాక్టు కార్మికునకు శాశ్వత ఉద్యోగికి ఇచ్చే కనీస వేతనాలను, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలుగా చెల్లించాలని, అయితే చట్ట ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మిక చట్టాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే నిబంధన ప్రకారం పొరుగుసేవల సిబ్బందికి మరియు కాంట్రాక్టు కార్మికులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు అలవెన్సులను చెల్లించాలని డిమాండ్ చేశారు. అరకొర జీతభత్యాలతో, అర్ధ ఆకలితో అలమటిస్తున్న కాంట్రాక్టు కార్మికుల ముఖాలలో చిరునవ్వులు చిందించే విధంగా కార్మిక చట్టాలు అమలు చెయ్యాలని కోరారు. పొరుగు సేవల సిబ్బందిని విద్యుత్ సంస్థలలో విలీనం చేసి, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 2019 నుండి తేది 31-08-2004 మధ్య విద్యుత్ సంస్థలలో నియమించబడిన

ఉద్యోగులకు జి.పి.యఫ్ మరియు పాత పెన్షన్ విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలందిస్తూ ఉద్యోగ విధి నిర్వహణ లో ప్రమాదానికి గురై మరణించిన,శాశ్వత దుర్భలత్వం పొందిన జూనియర్ లైన్మెన్ గ్రేడ్- 2 (ఎనర్జీ అసిస్టెంటు) ల పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పధకం క్రింద తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కరువు భత్యం బకాయిలతో సహా తేది. 01-07-2022 నుండి పెండింగ్ ఉన్న డి.ఎ లను విడుదల చేయాలని, వేతన సవరణ 2022 కి సంబంధించి క్రింద పేర్కొన్న విధంగా సింగిల్ మాస్టరు స్కేలు అమలు చేయడం తో పాటు పాత విధానంలోనే వేతన సవరణ నిబంధనలు అమలు జేస్తూ సానుకూలమైన వేతన సవరణ, 2022 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏకసభ్య కమీషన్ టిఆర్ఎసి రిపోర్టును పక్కన పెట్టాలని కోరారు. వేతన సవరణ ప్రక్రియ వల్ల ఏ ఒక్క ఉద్యోగి విశ్రాంతి ఉద్యోగి ప్రయోజనాలకు నష్టం కలిగించని విధంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉభయులు అంగీకారంతో వేతన సవరణ 2022 ని వెంటనే ఖరారు చేయాలన్నారు. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ సంస్థలు అనుసరించిన విధంగా సింగిల్ మాస్టర్ స్కేల్ వర్తింప జేస్తూ మూల్యాంకనం ఇప్పటికే ఉన్న విధానాన్ని అనుసరించడంతో పాటు ఏ ఒక్క ఉద్యోగి యొక్క మూలవేతనం, అలవెన్సులు తగ్గించకుండా, వ్యక్తిగత చెల్లింపు ప్రత్యేక చెల్లింపు భావన ఆమోదయోగ్యం కాదన్నారు. వేతన సవరణ-2022 సవరించిన పే స్కేల్ లో ఇంక్రిమెంటు రేటు ప్రస్తుతం ఉన్న ఇంక్రిమెంటు రేటు కంటే తక్కువగా ఉండకుండా ఏ ఒక్క ఉద్యోగి నష్టానికి గురి కాకుండా వేతన సవరణ 2022 (టిఆర్ఎసి-2022)ని గతంలో మాదిరిగా ఇప్పటికే ఉన్న విధానాన్ని అనుసరించడంతో పాటు సింగిల్ మాస్టర్ స్కేలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

 

విద్యుత్ ఉద్యోగులకు / పెన్షనర్లుకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంతృప్తికరమైన నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యాన్ని అందుబాటు లోకి తక్షణమే తేవాలని సూచించారు. అన్ని ఎ.పి. విద్యుత్ సంస్థల యొక్క పి అండ్ జి ట్రస్టులు ఎప్పటికప్పుడు బలోపేతం చేయాలన్నారు. పి అండ్ జి ట్రస్టులో యూనియన్లు/ అసోసియేషన్లకు సభ్యత్వం కల్పించాలని కోరారు. రాష్ట్రం లోని అన్ని ఎ.పి. విద్యుత్ సంస్థల పి అండ్ జి ట్రస్టులలో నిర్దిష్టమైన నిబంధనల ప్రకారం నిధులు జమ చేయాలని ట్రస్టులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. క్రిందిస్థాయి సిబ్బంది కొరత లేకుండా చెయ్యాలన్నారు. 1994 సంవత్సరం నారమ్స్ పై యూనియన్లతో కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం. పని భారాని కనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయించాలని కోరారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సత్వర సేవలందించడంతో పాటు, సంస్థ అంతర్గత సామర్ధ్యం పెంచేందుకు తక్షణమే క్షేత్రస్థాయిలో ఖాళీగా ఉన్న అన్ని ప్రారంభ స్థాయి ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.పరిపాలన సౌలభ్యం కోసం, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు అనుగుణంగా కొత్త సర్కిల్స్ తో పాటు కొత్తగా అదనపు పోస్టులు మంజూరు చేసి, ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది వినియోగదారులు పెరుగుతూ వుంటే, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర సౌకర్యాలతో తీవ్రమైన అదనపు భారంతో కార్మికులు పనిచేస్తున్నప్పటికీ పెరిగిన వినియోగదారుల ప్రాతిపదికన అదనపు చేయకపోవడం శోచనీయం. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ను రాష్ట్రంలో నిరంతరము నియోగదారులకు అందించాలంటే ప్రతి వెయ్యి మంది వినియోగదారులకు కనీసం నలుగురు ఉద్యోగుల ఉండాలని అన్నారు.జూనియర్ అసిస్టెంటు పోస్టులకు బదిలీ ప్రక్రియ ద్వారా వెంటనే నియామాకాలు చేపట్టాలని కోరారు. విద్యుత్ ఉద్యోగులు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కారుణ్య నియామాకాల పధకం కింద

ఉద్యోగాలు పొందేందుకు తక్కువ వయస్సు కలిగిన లేదా ఎక్కువ వయస్సు కలిగిన కేసులను మానవీయ కోణంలో ప్రత్యేక కేసులుగా పరిగణించి వారికి కారుణ్య నియామక పథకం కింద ఉద్యోగాలు కల్పించాలని కోరారు. తగినంత నాణ్యమైన పరికరాలు, పనిముట్లు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నారమ్స్ ప్రకారంగా అన్ని తరగతుల పోస్టులు మంజూరు చేయడం ద్వారా ప్రస్తుతం పనిచేయుచున్న ఉద్యోగుల పై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించిన తర్వాత మాత్రమే ఎస్. ఓ.పి నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జేఏసీ చైర్మన్ వి.వి.ఎస్.నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ ఏ.రాజారత్నం, సెక్రటరీ జనరల్ కే. రత్నాలరావు, జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్. శ్రీనివాసరావు, జీ.జే సుధాకర్ , కె.వి నరసింహారావు ఏ హరిబాబు డి శ్రీనివాసరావు ఆర్.రామకృష్ణ పాల్గొన్నారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement