Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కొత్తపేట ఎమ్మెల్యే ను కలిసిన సచివాలయ ఏఎన్ఎంలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కొత్తపేట ఎమ్మెల్యే ను కలిసిన సచివాలయ ఏఎన్ఎంలు
తమ సమస్యల పరిస్కారం కోరుతూ వినతి పత్రం అందించిన ఏ. ఎన్. ఎం లు*

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

రావులపాలెం మండలం పరిధిలోని సచివాలయ ఏఎన్ఎం లు సోమవారం ఉదయం స్థానిక శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి ని వారి గృహంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. సచివాలయంలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఎంపిహెచ్ఎ(ఎఫ్) గ్రేడ్-౹౹ గా పదోన్నతి కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, గ్రేడ్-౹౹ లకు వర్తించే ఆలవెన్స్లు వర్తింపజేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో 10 నుండి 18 సంవత్సరాలు పని చేసిన వారి సర్వీసులను పరిగణనలోకి తీసుకోవాలని, విద్యాఅర్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని, బయోమెట్రిక్ రోజుకొకసారి తమ సచివాలయ పరిధిలో ఎక్కడునుండైన వేసుకునే వెసులుబాటు కల్పించాలని, యాప్ ల నుండి పనిభారం తగ్గించాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో ఏఎన్ఎంలు అనసూయ, సుబ్బలక్ష్మి, సత్యవేణి, సచివాలయ ఏఎన్ఎంలు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement