Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వరద భాదితులకు కూరగాయలు పంపిణీ చేసిన అంధ దంపతులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

—- దాతలు అంధ దంపతుల సేవలు అమూల్యమైనవి
— 200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

వరద ఉధృతి తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భాధిత కుటుంబాలకు ప్రతీ ఏడాది నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న అంధ దంపతులు దాట్ల సత్యనారాయణ రాజు, విజయకుమారి సేవలు అమూల్యమైనవి అని మామిడికుదురు మండల ఇంఛార్జి తహసిల్దార్ జె.వెంకటేశ్వరి అన్నారు.కాకినాడ కి చెందిన అంధ దంపతులైన దాతలు సమకూర్చిన కూరగాయలు మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలైన పాశర్లపూడి, పాశర్లపూడి లంక గ్రామాల్లోని సుమారు 200 కుటుంబాలకి అందజేశారు. పాశర్లపూడి గ్రామంలో సర్పంచ్ కోనుకు ప్రేమజ్యోతి నాగరాజు,ఎంపీటీసీ అంకాని అంజి, తహసిల్దార్ జె.వెంకటేశ్వరి చేతులమీదుగా వరద బాధితులకు అందజేశారు . అదే విధంగా పాశర్లపూడి లంక గ్రామంలో సర్పంచ్ తెలగారెడ్డి సూర్య ప్రకాశరావు,ఎంపీటీసీ చెరుకూరి పార్వతి సత్తిబాబు చేతులమీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా అంధ దంపతులైన దాతలు దాట్ల సత్యనారాయణ రాజు, విజయకుమారి లకు పలువురు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement