Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పార్టీలకతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కోరుకొండ మండలం:

పార్టీలకతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు…

 

మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..

 

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమానందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మండపేట నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.

మండలంలోని నదురుబాద గ్రామంలో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడికి సంక్షేమానందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. పార్టీలకతీతంగా పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూడా వైసిపి ప్రభుత్వాన్ని దేనన్నారు.అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, గ్రామ ఉపసర్పంచ్ మిర్తిపాటి సత్యనారాయణ, ఏఎంసి డైరెక్టర్ తేతల సుబ్బరామారెడ్డి,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జామి సీతారామాంజనేయులు, పార్టీ నాయకులు సబ్బవరపు వెంకటరమణ, ఉండవల్లి శ్రీనివాస్ చౌదరి, ఎంపీడీవో కొవ్వూరి నరేంద్ర రెడ్డి, తహసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎస్సై జి. నరేష్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో జె .సుధారాణి, పంచాయతీరాజ్ డి ఈ వి .రామనారాయణ, హౌసింగ్ ఏఈ కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement