Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాజోలు లో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

—– వాడ వాడలా ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు
—– బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ తో దియేటర్ల వద్ద సందడి
—– రాజోలు ఫోర్ షోస్ సినీ ఫ్లెక్ దియేటర్ వద్ద పండగ వాతావరణం

విశ్వంవాయిస్ న్యూస్, రాజోలు:

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా బుధవారం అభిమానులు ఆనందోత్సాహాలతో బర్డ్ డే వేడుకలు జరుపుకున్నారు. రాజోలు లోని ఫోర్ షోస్ (4 షోస్) థియేటర్ లో మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ సినిమా రీ- రిలీజ్ ప్రదర్శించడంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహేష్ బాబు ,పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మేన్ సినిమా రీ- రిలీజ్ కావడంతో అభిమానులు బాణసంచా కాలుస్తు సందడి చేశారు. ఆయా గ్రామాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. మహేష్ బాబు అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్ డే కేకును థియేటర్ యజమాని పాలిక శ్రీనివాస బాబు కట్ చేసి అభిమానులకి పంచారు. హీరో ఎంట్రీ , పాటలు,ఫైట్స్,డైలాగ్స్ వంటి సన్నివేశాలలో ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ,డ్యాన్సులు చేస్తూ, ఆనందంలో మునిగితేలారు ….. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు అభిమానులు హేమంత్,సంగీత రాజు,ఉదయ్,రఘు,కామేష్, కొండా , భరత్, శ్రీను, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement