ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందజేత
తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన 13 నెలల బాలుడు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జి పేట గ్రామానికి చెందిన 13 నెలల చిన్నారికి అవార్డువరించింది. వివరాల ప్రకారం జార్జి పేట గ్రామ కుటుంబంలోని 13 నెలల ఆకుండి నాగ అనిరుద్ తన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఇంటి వద్ద తల్లిదండ్రులు వస్తువుల పేర్లు చెప్పడంతో పెద్దల మాదిరిగానే 13 నెలల బాలుడైన ఈ చిన్నారి ఇట్టే గుర్తు పట్టేస్తున్నాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఏ వస్తువుని గురించి చెప్పినా చాకచక్యంగా వాటిని గుర్తిస్తున్నాడు. పిల్లవాడి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఢిల్లీలోని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు వీడియోలు పంపించారు. అనంతరం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు వీడియోలను పరిశీలించి బాలుడిని సూపర్ టాలెంటెడ్ కిడ్ గా ప్రకటించారు. బాలుడికి అవార్డును ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 13 నెలల చిన్నారికి ఇంత చిన్న వయసులో ఎంత టాలెంట్ ఉండడం, అవార్డు రావడం చాలా సంతోషమని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.