Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి జగన్ తోనే సాధ్యం —— రాజోలు ఎం ఎల్ ఏ రాపాక వరప్రసాదరావు 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు అన్నారు. మామిడికుదురు మండలం గోగన్నమఠంలో ఆదివారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాకకి స్థానికులు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పాలనకు మరోసారి ప్రజలంతా సీఎం జగన్ కు అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ వాలంటీర్లును ఎం .ఏల్ .ఏ రాపాక వరప్రసాదరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు భూపతి రాజు సత్తిబాబు రాజు, సొసైటీ చైర్మన్ సాగి పీ.ఆర్.వి.ఎస్.ఎస్ నరసింహ వర్మ ( బాబులు ), మామిడి కుదురు జడ్పిటిసి కసిరెడ్డి అంజిబాబు, రాజోలు జడ్పిటిసి మట్టా శైలజ, తాటిపాక ఏఎంసీ చైర్మన్ గుబ్బల రోజా రమణి ,వైస్ చైర్మన్ సుంకర బాబ్జి, కంచర్ల శేఖర్, మామిడి కుదురు వైస్ ఎంపీపీ భూపతిరాజు లక్ష్మి, భూపతిరాజు సతీష్ రాజు, మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు సూరిశెట్టి బాబి,అల్లు సురేష్ బాబు, వర్ధినేని రాము, చేట్ల సత్యనారాయణ,స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గం వైసీపీ ముఖ్య నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement