ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
రాఖి పౌర్ణమి పురస్కరించుకొని ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాళ్ళరేవు మండలం నుండి అన్ని శాఖల్లో పని చేస్తున్న మహిళలు మరియు డ్వాక్రా యానిమేటర్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీలు పట్టుకొని కట్టడానికి వచ్చిన మహిళలను అభినందించి ఆశీర్వదించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన విందును స్వీకరించారు. కార్యక్రమంలో తాళ్లరేవు మండలం నుండి వివో ఏ మంగామని, యానిమేటర్లు, ఇతర శాఖలో పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు.