మాల మహానాడు అధ్యక్షుడు జక్కల ప్రసాద్ బాబు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
దళితుల మద్దతుతో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులను అణిచివేసే ప్రయత్నం చేస్తుందని కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం మాల మహానాడు అధ్యక్షుడు జక్కల ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా దళితులకు ఏర్పరిచిన సంక్షేమ ఫలాలను తొలగించేసి అన్ని వర్గాలకు పంపిణీ చేయడం దళిత వర్గానికి అభివృద్ధి చేయడమా అని ప్రశ్నించారు. దళితుల అభివృద్ధికి భూమి కొనుగోలు చేసి, ఉపాధి కల్పన పథకాలను తుంగలోకి తొక్కి దళితుల పక్షంగా వైసిపి ప్రభుత్వం ఉందని చెప్పుకోవడంసిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం దళితులను పావులుగానే వాడుకుంటుందని, అభివృద్ధికి దూరం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం దళితులకు రావలసిన ఫలాలను తక్షణమే అందించేలా కృషిచేసి చూపించాలని అన్నారు.