Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మామిడికుదురు దీప్తి పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

యావత్ జగత్తుకు ధర్మరక్షకుడు శ్రీ కృష్ణుడని దీప్తి విద్యాసంస్థల అధినేత డివివి సత్యనారాయణ అన్నారు. స్థానిక దీప్తి పాఠశాలలో మంగళవారం ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివివి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ….. శ్రీ కృష్ణాష్టమి విశిష్ట చరిత్ర గలిగిన హిందూ సంప్రదాయ వేడుక అని తెలిపారు. శ్రీకృష్ణుడి చరిత్ర తల్లిప్రేమకు, ఆప్యాయతకు ప్రతిబింబం అన్నారు. శ్రీకృష్ణుడి జీవిత గాధ ధర్మానికి మార్గదర్శనం అన్నారు. శ్రీకృష్ణుడి చరిత్ర ఆధారంగా రాసిన భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శనం అన్నారు. వేడుకలలో భాగంగా చిన్నారులు వేసిన చిన్నికృష్ణుడు గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి.కోలాటం,ఆట పాటలతో పాఠశాల ప్రాంగణం అంతా కోలాహలంతో నిండింది . అనంతరం కృష్ణులచే ఉట్టి కొట్టించారు. ఈ కార్యక్రమంలో దీప్తి పాఠశాల ప్రధానోపాధ్యాయులు యక్కలదేవర నాగన్న బాబు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement