Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నగరంలో జాలెం సుబ్బారావు ఆమరణ నిరహార దీక్ష విరమణ 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో అధినేత కు మద్దతుగా నగరం గ్రామంలో పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు,టీడీపీ నగరం గ్రామ శాఖ అద్యక్షులు జాలెం సుబ్బారావు గత రెండు రోజులుగా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే…

వయసురీత్యా ఆమరణ నిరహార దీక్ష వద్దని కుటుంబ సభ్యులు,అభిమానులు, ఎంత వారించినా పట్టు వదలని విక్రమార్కుడిలా సుబ్బారావు తన దీక్షను ప్రారంభించారు. గత రెండు రోజులుగా టీడీపీ సీనియర్ నేతలు, రాజోలు,పి.గన్నవరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ,అభిమానులు సుబ్బారావుకు సంఘీభావాన్ని తెలిపారు . మామిడికుదురు మండల జనసేన పార్టీ , మండల సర్పంచ్ సమాఖ్య కూడా దీక్షా శిబిరానికి చేరుకుని తమ మద్దతు తెలిపారు.

ఇప్పటికే చంద్రబాబు అరెస్టుతో వివిధ రూపాల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు కంటే భిన్నంగా తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం లోని నగరం గ్రామంలో ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న జాలెం సుబ్బారావుపై పార్టీ అధిష్టానం ఆరాతీసింది. ఐదు పదుల వయస్సులో ఉన్న సుబ్బారావు ఆరోగ్య భద్రత దృష్ట్యా వెంటనే దీక్ష విరమింపజేయాలని టీడీపీ రాష్ట్ర అద్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు,అమలాపురం పార్లమెంట్ ఇంఛార్జి గంటి హరీష్ మాధుర్ కి సూచించినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ జెడ్పీ చైర్మన్,పి.గన్నవరం నియోజకవర్గం టూ – మెన్ కమిటీ సభ్యులు నామన రాంబాబు సోమవారం రాత్రి నగరం గ్రామంలో ఆమరణ నిరహార దీక్ష వేదిక వద్దకు చేరుకుని దీక్ష విరమింపజేయాలని సుబ్బారావును అతని కుటుంబ సభ్యులను కోరారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ పార్టీ అని ,పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని , రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని నామన రాంబాబు సూచించారు. అనంతరం సుబ్బారావుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ…. తన అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడంతో తాను ఆమరణ నిరహార దీక్ష చేపట్టానని , గత రెండు రోజులుగా తాను చేస్తున్న దీక్షకు పార్టీలకు అతీతంగా వచ్చి సంఘీభావం తెలిపిన వారందరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటానన్నారు.రాజోలు,పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి టీడీపీ కుటుంబ సభ్యులు తన వెన్నంటే ఉంటూ,ప్రోత్సహించడం , మద్దతు తెలియజేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగరం గ్రామ సర్పంచ్ జాలెం రమణ కుమారి,టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్, బోనం బాబు, చుట్టుగుల్ల కిషోర్,కడలి నూకరాజు,ముఖరం హుస్సేన్,కోళ్ల సురేష్ బాబు, జాలెం రాంబాబు,మద్దాల నాగబాబు,కోలా రాంబాబు,కిశ్వర్ మేహిద్దెన్,రాయుడు ఆనంద రావు, రాయుడు ఏసు,రాయుడు శ్రీనివాస్,గుబ్బల శ్రీనివాస్,గుబ్బల శివన్నారాయణ, జేటి, గుబ్బల మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement