Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సాయి హాస్పటల్లో రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలు ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సర్జరీలను గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి
– గోదావరి జిల్లాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం అని డాక్టర్ కురుకూరి విజయకుమార్ వెల్లడి

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

సాయి హాస్పటల్లో రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలు ప్రారంభం

– అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సర్జరీలను గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి

– గోదావరి జిల్లాల్లో ఇదే తొలిసారి కావడం విశేషం అని డాక్టర్ కురుకూరి విజయకుమార్ వెల్లడి

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
గోదావరి జిల్లాల్లో తొలిసారి రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో ఉన్న సాయి హాస్పటల్స్లో రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలను ప్రారంభించినట్టు సాయి హాస్పటల్స్ అధినేత, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, కీళ్ల మార్పిడి సర్జరీల నిపుణుడు డాక్టర్ కురుకూరి విజయకుమార్ చెప్పారు. ఆదివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్ సర్జరీలు చేయించుకోవాలంటే ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇక నుండి అలాంటి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సర్జరీలను గోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో, సాయి హాస్పిటల్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ విజయకుమార్ చెప్పారు.
సాధారణ మోకాలు మార్పిడి సర్జరీ కన్నా, రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ వల్ల పేషంట్లకు కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
అందువల్లే రోబోటిక్ సర్జరీ చేయించుకోవటం మంచిదని సూచిస్తున్నామని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు.

ఇప్పటి వరకు తాము చేస్తున్న సంప్రదాయ విధానంలోని మోకాలు మార్పిడి సర్జరీతో పోలిస్తే, రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ తప్పనిసరిగా మంచి ఫలితాలిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ విజయ కుమార్ చెప్పారు. సాధారణ మోకాలు మార్పిడిసర్జరీలో కన్నా సర్జరీలోని కోత చాలా చిన్నదిగా ఉంటుందని, నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుందన్నారు.
అన్నింటికీ మించి సర్జరీని అత్యంత ఖచ్చితత్వంతో చేయగలుగుతా మన్నారు. అంటే మోకాలు మార్పిడి సర్జరీలో, కృత్రిమ కీలును అమర్చే ప్రక్రియలో ఎముకను ఎంత వరకు కోయాలో అంత వరకే కోసేందుకు రోబోటిక్ సర్జరీలో వీలుకలుగుతోంద న్నారు.మోకాలు మార్పిడి సర్జరీలో ఇది చాలా మంచి పరిణామమన్నారు.
ఖచ్చితమైన ప్రమాణాలు, నాణ్యత, తక్కువ నొప్పి, అత్యంత మన్నిక, త్వరగా కోలుకోవటం, ఆసుపత్రిలో తక్కువ రోజులు ఉండటం
రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ ప్రత్యేకతలని డాక్టర్ విజయకుమార్ చెప్పారు. మోకాలు మార్పిడి సర్జరీ చేయించుకున్న వ్యక్తి. తన రోజువారీ విధులకు చాలా త్వరగా హాజరవగలుగుతారన్నారు. అంటే సర్వీసులో ఉన్న వారు ఎక్కువ సెలవులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. చిన్న వయస్సులో ఉన్న వారికి మోకాలు మార్పిడి సర్జరీ చేయాల్సివచ్చినపుడు రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ అత్యుత్తమ ఫలితాలనిస్తుందని డాక్టర్ విజయకుమార్ చెప్పారు.

గోదావరి జిల్లాల ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అత్యంత విలువైన సర్జరీలను కూడా గోదావరి జిల్లాల వాకెట్లోనే, పొందాలన్న ఉద్దేశ్యంతోనే రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలను సాయి హాస్పటల్స్ లో ప్రారంభించినట్టు డాక్టర్ విజయకుమార్ చెప్పారు. రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీ అంటే రోబో మాత్రమే చేస్తుందన్న అపోహలు ఉన్నాయని, ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. రోబోటిక్ సర్జరీ అయినా సరే తానే సర్జరీ చేస్తానని, ఆ సర్జరీలో రోబోను ఉపయోగిస్తామని, రోబోను ఎలా ఉపయోగించాలి? ఎంత వరకు ఉపయోగించాలన్న అంశాలు డాక్టర్ నైపుణ్యంపైనే ఆధారపడి ఉంటాయన్నారు.

ఇప్పటికే వేల సంఖ్యలో మోకాలు మార్పిడి ఆపరేషన్లతో పాటు కీళ్ల మార్పిడి ఆపరేషన్లను చేసిన తాను ఇపుడు గోదావరి జిల్లాలకు రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీలను కూడా అందించగలుగుతున్నట్టు డాక్టర్ విజయకుమార్ చెప్పారు. ఈ సందర్భంంగా రోబోటిక్ మోకాలు మార్పిడి సర్జరీని ప్రత్యక్ష ప్రసారం ద్వారా గోదావరి జిల్లాలకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్లకు ప్రదర్శించారు. ప్రత్యేకంగా రోబోను తీసుకొచ్చి, హేండ్స్ ఆన్ కార్యక్రమంలో భాగంగా ఆర్థోపెడిక్ సర్జన్లకు వర్క్ షాపు నిర్వహించారు.ఈ పాత్రికేయుల సమావేశంలో హాస్పిటల్ సి.ఈ.ఓ ఏం.నాగేంద్ర పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement