Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఉచిత వైద్య ఔషధ సేవా శిబిరం..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కె.ఎస్.ఆర్.హాస్పిటల్,మానవతా స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో…

విశ్వంవాయిస్ న్యూస్, రాజమండ్రి:

 

రాజమహేంద్రవరం, అక్టోబర్29:

కేఎస్ఆర్ హాస్పిటల్స్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి గట్టున కంభం సత్రం ఎదురుగా ఉన్న కె ఎస్ ఆర్ హాస్పిటల్ లో ఉచిత వైద్య, ఔషధ సేవా శిబిరం నిర్వహించారు.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఈ ఉచిత వైద్య, ఔషధ సేవా శిబిరంలో ప్రముఖ వైద్యులు కె.ఎస్.ఆర్.హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొమ్మ ఉజ్వల్, డాక్టర్ కొమ్మ సుస్మిత, డాక్టర్ శశాంక్ పిల్లారిశెట్టి, డాక్టర్ సత్తి రవికాంత్, డాక్టర్ లంక వంశీ, సత్యా కిడ్నీ కేర్ వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు.శిబిరంలో బిపి.షుగర్,చెవి, ముక్కు, గొంతు సంబంధ,పంటి,మూత్ర కిడ్నీ,నరాల సంబంధ వ్యాధులు,ఇతర జనరల్ వ్యాధులకు, ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.సమీప ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఉచితంగా ఓటోస్కోపీ ,హిమోగ్లోబిన్, ఈసీజీ, బ్లడ్ షుగర్ పరీక్షలను ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా కె.ఎస్.ఆర్.హాస్పటల్స్ కన్వీనర్ డాక్టర్ కొమ్మ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉచిత వైద్య ఔషధ సేవా శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందచేస్తున్నామని వివరించారు.250 మంది శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారని చెప్పారు. వైద్య సేవలు అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కె.ఎస్.ఆర్.ఆసుపత్రి , మానవతా స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఉచిత వైద్య శిబిరంలో మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు,మింది నాగేంద్ర పాల్గొన్నారు. మానవతా స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు సి.హెచ్.ప్రసాదరెడ్డి,బి.ఎస్.ఎన్.మూర్తి,గాంధీ,కృష్ణ ప్రసాదరెడ్డి, రాజ్యలక్ష్మి,కె.ఎస్.ఆర్.హాస్పటల్స్ కన్వీనర్ కొమ్మ శ్రీనివాసరావు,బి.ఎం.పి. వ్యవస్థాపక అధ్యక్షుడు లంక సత్యనారాయణ, పక్కుర్తి సత్యనారాయణ,ఆకాశం గౌరీష్ బాబు,ఎస్.కె.సిద్దూ,కన్నాబత్తుల శ్రీనివాసరావు,ఎస్.కె.బాబ్జి,కె.ఎస్.ఆర్.హాస్పటల్స్ సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement