Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కనుల పండుగగా నారీశక్తి సమ్మేళన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సంస్కృతి పరిరక్షణలో స్త్రీల పాత్ర అమొఘాం

విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం:

రాజానగరం, విశ్వం వాయిస్ న్యూస్:

రాజానగరం స్థానిక జీ.యస్.ఎల్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు నారీ శక్తి సమ్మేళన కార్యక్రమము కనుల పండుగగా జరిగింది.

సుమారు ఐదు జిల్లాల నుండి రెండువేల ఐదు వందల మంది మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య వక్తగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సి అనంత లక్ష్మి మాట్లాడుతూ సనాతన భారతీయ సంస్కతికి ఆయువుపట్టు మహిళ అని వేదకాలం నుండి నేటి వరకు దేశ రక్షణలో సంస్కృతి పరిరక్షణలో స్త్రీల పాత్ర అమోఘమని నేటి ప్రపంచమంతా భారతీయత వైపు ఆశావహ దృక్పథంతో వుందని,ఇలాంటి మహోన్నత భారతీయత అస్తిత్వానికి స్త్రీలలే జీవన వాహినిగా నిలిచిందని తెలిపారు.కావున యువతీ యువకులు అన్ని రంగాలలో దేశీయ భావాలతో ఎదగాలని పిలుపునిచ్చారు.మరియొక ముఖ్య వక్త నాగపూర్ కేంద్రం, రాష్ట్ర సేవికా సమితి అధ్యక్షులు ,అఖిల భారతీయ ప్రముఖ్ కార్యవాహిక మాననీయ శ్రీ అన్నదానం సీతా గాయత్రి మాట్లాడుతూ ప్రపంచములోనే విశిష్ట ,విలక్షణ సంస్కృతీ భారతీయ సంస్కృతి అని,ఇటువంటి సంస్కృతికి వెన్నెముక కుటుంబ వ్యవస్థయని అటువంటి కుటుంబానికి కవచం మహిళయని తెలిపారు.

పురుషుని అస్తిత్వానికి ,వ్యక్తిత్వానికి , ఆలోచనలకు ప్రాణ వాయువు నారీయేయని అన్నారు.

పురుషునితో పోల్చితే స్త్రీ భిన్న పనులు నిర్వహించగలదని ,ఈ అంశాన్ని మన పెద్దలు గుర్తెరిగి స్త్రీ గృహానికి అధినేతగా నిల్పి ,ఇంటికి దీపంగా తీర్చిదిద్దారని అన్నారు.

ఆది కాలం నుండి భారతీయ వేద,పురాణ,ఇతిహాస,ఉపనిషత్ గ్రంధాల అంశాల్లో స్త్రీకి ప్రముఖ పాత్ర ,ఉన్నత స్థానాన్ని కల్పించిన అంశాన్ని ప్రస్తావిస్తూ నేడు ఆ గ్రంధాల్లో తెలిపిన నారీ శక్తిని ప్రతి ఒక్కరు జాగృతం చేసుకోవాలన్నారు. ,భారతీయ ధర్మాల్ని కుహనా మేధావులు వికృత వ్యూహాలతో చెడుగా దర్శింప చేస్తు మత మార్పిడులు చేస్తూ విదేశీ విష సంస్కృతీనీ వ్యాప్తిoప చేస్తున్న తరుణంలో మహిళలందరూ మన మహోన్నత గ్రంథాలను అధ్యయనం చేయవలసిన,తెలుసుకోవలసిన అవశ్యకత నిండుగా వుందనీ తెలిపారు.మాట్లాడే శక్తిని,పోరాడే శక్తిని,దేశ ప్రగతికి ఉపకరించే లక్ష్యాల వైపు ప్రతి మహిళ తయారు కావాలని కోరారు.

ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కె.మాధవి లత, జీ.యస్.ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డా,,గన్ని కాసింబి పాల్గొన్నారు.మహిళల సమస్యలు, పరిష్కారములను అంశాలపై

యస్ విజయ భారతి,లింగం ఉజ్జ్వల, జీ.సంయుక్త ,సుభద్ర రాణి , పద్మావతి తదితరులు విచ్చేసిన మహిళలతో చర్చించారు.కోలాటం,సంగీతం, నృత్యములు వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ కళాకారులచే నిర్వహించారు.

దుర్గా వాహిని,రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్,శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి , సమరసతా సేవా ఫౌండేషన్ మొదలైన వివిధ ఆధ్యాత్మిక,సామాజిక ,ధార్మిక సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement