Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి    

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి 

తన నోటిని అదుపులో పెట్టుకోవాలని 

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఒక ప్రకటనలో హెచ్చరించింది.ఈ మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్,

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

 

రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఒక ప్రకటనలో హెచ్చరించింది.ఈ మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బొల్లిన నిర్మల కిషోర్ హేచ్చరించింది

తూర్పు గోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు మద్దిపాటి రజనీ , జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకట లక్ష్మీ సంతోషి తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న మీరా మహిళలను గౌరవించేదని ప్రశ్నించారు.

ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను చులకన చేసిన వారికి ఎటువంటి గతి పట్టిందో చరిత్ర ద్వారా తెలుసుకోవాలని సూచించారు.

పురంధేశ్వరి మద్యం మాఫియా పై విచారణ చేయించాలని చెబితే ట్విట్టర్ సాయి మీడియా ముందు కు వచ్చి మాట్లాడిన తీరు ను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటు న్నారని వ్యాఖ్యానించారు.

ఆడిటర్ గా దొంగ లెక్కలు వేయడం వల్ల మీ నాయకుడు ఎన్ని నెలలు జైలులో ఉన్నారో అని ఎద్దేవా చేశారు.

పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయ సాయి మీడియా ముందు అబద్ధాలు వల్లె వేస్తున్నారని ఆరోపించారు.

మద్యం తయారీ కంపెనీలో మీ హస్తం ఉందా లేదా అని జవాబు మానేసి మద్యం అలవాటు లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

రాష్ట్ర అప్పులపై ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయాలంటే ఇంతవరకు సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

సొంత మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే రాజకీయ క్షేత్రంలో నిలదీయడానికి బిజెపి మహిళా మోర్చా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.కార్యదర్శి తాడిమల్ల విజయవాణి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు తుమ్మల పద్మజ, శ్రీదేవి, చిట్టూరి రాజేశ్వరి,ఉమా మహేశ్వరీ, కస్తూరి, అనురాధ.భువన ఉమ,శ్రీదేవీ తదితరులు ఆ వ్యాఖ్యలను ఖండించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement