Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రెండు రైళ్లు ఢీ.. విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

హుటాహుటిన ఘటనాస్థలానికి సహాయక బృందాలు
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది..
అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు.

విశ్వంవాయిస్ న్యూస్, విజయనగరం:

విజయనగరం, విశ్వం వాయిస్ న్యూస్:

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది..

అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్‌ రైలును ఢీ కొట్టింది. రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్‌ఎం సౌరబ్ ప్రసాద్‌ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరిననట్లు డీఆర్‌ఎం తెలిపారు.

ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొనడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.ఘటనా స్థలిలో భీతావహ పరిస్థితి నెలకొంది..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement