Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కోరింగ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోరింగ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం

కారు ఆటో ఢీకొనడం వలన జరిగిన ప్రమాదం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం కోరింగ పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం కాకినాడ నుండి యానం వైపు వస్తున్న కారు యానం నుండి కాకినాడ వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి, స్థానికులు హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది, కారు ముందు ఒక ప్రక్క భాగం పాడయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు కోరంగి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement