Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రామచంద్రపురంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాంచంద్రపురం పట్టణం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రపంచ దివ్యంగుల దినోత్సవం పురస్కరించుకుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రామచంద్రపురం మండల తాసిల్దార్ పాల్గొన్నారు. వికలాంగులను ఉదేశించి తాసిల్దార్గారు మాట్లాడుతూ ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే కనుక కంపల్సరిగా నా వంతు సహకారం నేను వికలాంగులకు చేస్తానని మీరు నాకు అర్జి రూపంలో లెటర్ ఇచ్చినట్టు అయితే ఎంక్వయిరీ చేసి మీకు స్థలం ఇచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తానని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు రాజు మాట్లాడుతూప్రజాస్వామ్యంలో మేము ఈ రాష్ట్రంలో 25 లక్షల కు పైగా ఉన్న మాకు అన్ని రాజకీయ పార్టీలు ఫోర్ శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రపంచ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక ప్రభుత్వ పథకాలలో వికలాంగులకు అన్ని పథకాలలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టవలెను ఈ రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది అవగాహన లేకుండా వికలాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి 2016 చట్టాన్ని అమలు చేసే విధంగా ఒక జీవోని జారీ చేయవలెనని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని తీర్మానం చేసింది.తీర్మానం కాపీని మండల రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై తాసిల్దార్ సానుకూలంగా స్పందించారు ముఖ్యంగా కుటుంబ రేషన్ కార్డులు ఉన్న ఉద్యోగస్తులను తక్షణమే ఆ కార్డు నుండి తొలగించవలెను మరో విషయం ఒంటరిగా ఉన్న వికలాంగుడు గాని వికలాంగురాలు గాని వైట్ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టవలెను అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక నిర్మాణం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షుడు పలివె ల రాజు మండల నాయకులు రాయుడు బుల్లయ్య కృష్ణారెడ్డి పట్టణ నాయకులు టైలర్ శ్రీను నాగేంద్ర కాదా శ్రీను మల్లికార్జున్ రావు దిగిమర్తి శీను రవణ గురుమూర్తి మహిళా నాయకురాలు పలివెల ఉమాదేవి సత్య నాగరత్నం వీరలక్ష్మి మేరీ మంగ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement