Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాట స్పూర్తితో రాజ్యాంగాన్ని,రిజర్వేషన్ లను కాపాడుకుందాం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పి డి యస్ యు ఆధ్వర్యంలో అంబేద్కర్ కి ఘననివాళి

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పోరాట స్పూర్తితో రాజ్యాంగాన్ని,రిజర్వేషన్ లను కాపాడుకుందాం

 

విశ్వం వాయిస్ రామచంద్రపురం పట్టణంలో అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్బంగా బి.సిద్ధూ పీ డీ ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్డు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, దళిత,పీడిత,బహుజన కులాలు హక్కుల ప్రదాత బాబా సాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి పీ డీ ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన విగ్రహానికి పీ డీ ఎస్ యు నాయకులు బి. సిద్ధూ,రామచంద్రపురం సాంఘిక సంక్షేమ హాస్టల్ సిబ్బంది సహదేవుడు, వెంకటేశ్వరరావు,ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.బి సిద్ధూ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ నేటి సమాజానికి ఎంతో ఆదర్శం అన్నారు.ఆయన సమానత్వాన్నికి మార్గదర్శి అన్నారు. అంబేద్కర్ అమరత్వం చెంది 67 సంవత్సరాలు కావస్తున్నదని.ఆయన తన జీవితాంతం అంటరాని తనానికి వ్యతిరేకంగా,కుల నిర్మూలన కోసం, అణగారిన వర్గాల వారి హక్కులు కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం అహర్నిశలు కృషి చేశారని.అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని నేడు మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అన్నారు.అణగారిన వర్గాలు ఆర్థికంగా,సాంఘికంగా,రాజకీయంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు,ఎస్.సి.ఎస్. టీ చట్టాన్ని రద్దు చేయడానికి,దేశ ప్రజలందరికీ ఉపయోగకరమైన ప్రాధమిక హక్కులు రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాజ్యాంగాన్ని,రాజ్యాంగం లో ఉన్న హక్కులను కాపాడుకోవడం కోసం దళిత,పీడిత, బహుజనులు అందరూ అంబేద్కర్ స్పూర్తితో పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ నాయకులు సాయి చరణ్, అమర్,కరుణాకర్, గౌతమ్,వీరబాబు,విజయ్ తేజా,ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement