Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కనీసవేతనం 26 వేలు చెల్లించాలని అంగన్వాడీల సమ్మె

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో 12వ తారీకు మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాష్ట్రం లో అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాలవద్ద అంగన్వాడీల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అందులో భాగంగా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగ రామచంద్రపురం,కే గంగవరం మండలాలకు సంబంధించిన అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో సమ్మె శిబిరానికి చేరుకున్నారు.

ఈ సమ్మె శిబిరాన్ని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ స్టాలిన్ ప్రారంభించిన్నారు.ఈ సమ్మెని ఉదేశించి స్టాలిన్ గారు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరాం, అంగనవాడి జిల్లా కార్యదర్శి మేడిశెట్టి దురగ్గమ్మ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాల నుండి, తాహసిల్దార్ కార్యాలయాల నుండి, ఎమ్మెల్యేలు,మంత్రులకు అంగన్వాడీల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుండి స్పందన కరువైపోయిన కారణంగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెళ్లాల్సినటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శించారు.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు చెల్లిస్తానని హామీ ఇచ్చి అంగన్వాడీల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి నేటికి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నా ఒక్క డిమాండ్ ను కూడా పరిష్కారం చేయలేదని,తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీలకు 18000 వేతనం చెల్లించడానికి సిద్ధపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీచర్ కి 11500 ఆయమ్మకు,మినీ వర్కర్లకు 7000 మాత్రమే చెల్లిస్తూ అంగన్వాడీల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు.ప్రతిరోజు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు,జగన్ ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు,చెత్త పన్ను,ఇంటి పనులు చెల్లించలేక అప్పులపాలవుతున్నాము అనే ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని,ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని అంగన్వాడీలకు అమలు చేయాలని,సమ్మె డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈసమ్మె శిబిరానికి ఐఎఫ్ టీయు నాయకులు రాజు, ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ నాయకులు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఈరోజు శిబిరాన్ని ఎమ్మెల్యే కాన్స్టంట్ అభ్యర్థి ఎర్రం శెట్టి రామరాజు నిమ్మరసం ఇచ్చి విరమింప చేసినారు.ఈసమ్మెలో అంగనవాడి జిల్లా నెంబర్ వాసంశెట్టి సూర్యకుమారి, ప్రాజెక్టు అధ్యక్షురాలు ఉప్పులూరి వరలక్ష్మి, మండల అధ్యక్షులు కే విజయలక్ష్మి,జి శ్రీదేవి, సెక్టర్ లీడర్స్ కె జహీరా కే దుర్గ,వెంకటరత్నం, గుంతెదేవి,వీర వేణి మరియు అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement