Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నెల్లూరులో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

నెల్లూరులో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు

విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో పి డి ఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ద్రాక్షారామ శ్రీనివాస శైల ఐ.టీ.ఐ కళాశాలలో పోస్టర్లు ఆవిష్కరణ పీ డీ ఎస్ యూ రాష్ట్ర నాయకులు బి. సిద్ధూ మాట్లాడుతూ ఈనెల 15,16, 17 తేదీల్లో నెల్లూరులో నిర్వహించే పి డి ఎస్ యు 23 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని.పీ డీ ఎస్ యూ రాష్ట్ర నాయకులు.బి సిద్దు పిలుపునిచ్చారు. ద్రాక్షారామ శ్రీనివాస శైల ఐ. టీ.ఐ కళాశాలలో లో మహా సభ గోడ పత్రిక ఆవిష్కరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 15 మధ్యాహ్నం నెల్లూరులో విద్యార్థి ప్రదర్శన నిర్వహిస్తామని అనంతరం డాక్టర్ చాగంటి భాస్కరరావు ప్రాంగణం టౌన్ హాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ప్రధాన వక్తగా ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు.

పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు యు గనిరాజు సభకు అధ్యక్షత వహిస్తారని తెలిపారు.పి డి ఎస్ యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు,పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ రాజశేఖర్,పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం పరుశురాం, వక్తలుగా పాల్గొంటారని తెలిపారు.16,17 తేదీలలో జార్జి జంపాల నగర్ డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ప్రతినిధుల సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి .హరి గోపాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారని పేర్కొన్నారు.ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ టి.సత్యనారాయణ వక్త గా పాల్గొంటారని తెలిపారు. లౌకిక ప్రజాస్వామిక విలువల పరిరక్షణ విద్యార్థుల పాత్ర అనే అంశంపై కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.17న ప్రముఖ కవి,రచయిత సతీష్ చందర్ వక్తగా విచ్చేస్తారని తెలిపారు. యువతపై జన మాధ్యమాల సినిమా మీడియా ప్రభావం అనే అంశంపై చర్చిస్తారని తెలిపారు.వివిధ రాష్ట్రాల విప్లవ విద్యార్థి సంఘాల సందేశాలు ఉంటాయని తెలిపారు.అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళా కళాకారులచే కళా ప్రదర్శనలు నిర్వహిస్తారని ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు అందరూ పి డి ఎస్ యు రాష్ట్రస్థాయి సభలకు నెల్లూరు తరలిరావాలని సిద్దు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్.కిరణ్ కుమార్,కె.అనీల్ కుమార్,కె.అర్జున్,డీ. కొండబాబు,సాయి, అలీషా,శివ మణి, మహేష్,నరేంద్ర,ప్రశాంత్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement