Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

7వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కనీస వేతనం 26 వెలు చెలించాలి

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

కనీసవేతనం 26 వేలు చెల్లించాలని అంగన్వాడీల సమ్మె

 

7వ రోజు RDO ఆఫీస్ వద్ద ధర్నా

విశ్వం వాయిస్ రామచంద్రపురం  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టణ సీఐటీయూ ఆధ్వర్యంలో రామచంద్రపురం, మండపేట ప్రాజెక్టుల అంగనవాడి లు ఆర్ డి ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది.ఈధర్నా లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరామ్,అంగనవాడి జిల్లా ప్రధాన కార్యదర్శి కే కృష్ణ వేణి,కార్యదర్శి ఎమ్ దుర్గమ్మ అధ్యక్ష, కార్యదర్సులు రాణి,బేబీ, ఆదిలక్ష్మి,వి వీరలక్ష్మి అద్వర్యంలో 18 డిసెంబర్ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి ఆర్ డి ఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీల 7 వ రోజు నిరవధిక సమ్మె ప్రారంభమైంది.అందులో భాగంగా రామచంద్రపురం ఆర్ డి ఓ కార్యాలయం ఎదురుగ రామచంద్రపురం,కే గంగవరం,రాయవరం, మండపేట,కపిలేశ్వరపురం మండలాలకు సంబంధించిన అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో సమ్మె శిబిరానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ స్టాలిన్ ప్రారంభించి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల మీద సమ్మె ఈరోజు కి 7 రోజులు అయిందని ప్రభుత్వం సమ్మెని త్వరగా విరమింప చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనాలు చెల్లిస్తాను అన్న హామీ ని నిలబెట్టుకోవాలి అన్నారు. బలవంతన సెంటర్ తాళ్లలు పగల కొట్టి ఏమి సాధించలేరు అని అన్నారు.సీఎం అంగనవాడిలను తొలగిస్తామని అన్నారు అని మంత్రులు అనడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికి అయిన ప్రభుత్వం అంగనవాడి నాయయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ నాయకులు శ్యామల రాయవరం యు టి ఎఫ్ నాయకులు మద్దతు తెలియచేసారు.

సమ్మెలో అంగనవాడి జిల్లా నెంబర్ వాసంశెట్టి సూర్యకుమారి,మండల అధ్యక్షులు కే విజయలక్ష్మి, జి శ్రీదేవి,సెక్టర్ లీడర్స్ కే జహీరా,కే దుర్గ,జి వెంకటరత్నం,ఈ గోంతి దేవి,వీర వేణి.సి హెచ్ సత్యవతి మరియు 5 మండలాల అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement