Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మోడరన్ హైస్కూల్ వార్షికోత్సవం కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మక కళలను వెలికి తీసి వారిని అనేక రంగాలలో ముందు వరుసలో నిలపడానికి దోహద పడే స్కూల్ వార్షికోత్సవాలను ప్రతీ విద్యా సంవత్సరం క్రమం తప్పకుండ నిర్వహించటం సంప్రదాయంగా భావించే మోడరన్ హైస్కూల్ వార్షికోత్సవం శనివారం జోష్ ఫుల్ గా జరిగింది.ఈ సందర్బంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు విద్యార్థులను, కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన విద్యను కాకుండా మక్కువతో కూడిన విద్యను గత 46 విద్యా సంవత్సరాలుగా అందజేస్తున్నామని, మోడరన్ విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించి అనేక రంగాల్లో వేలాది మంది విద్యార్థులు స్థిరపడటం తనకు,మోడరన్ సిబ్బందికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.అనంతరం హైస్కూల్ అకడమిక్ డైరెక్టర్ ఆర్ ఉమాదేవి మాట్లాడుతూ ప్రతి విద్యార్థులను ఏదో కళ అంతర్లీనంగా ఉంటుందని, అటువంటి ప్రావీణ్యాన్ని గుర్తించి విద్యార్థులకు చేదోడు వాదోడుగా నిలవడానికి ఇటువంటి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అబ్బురపరిచాయి.విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కున మెరిసారు ఇటీవలే ఎస్.ఐ పోస్ట్ సాధించిన మోడరన్ విద్యాసంస్థల పూర్వవిద్యార్థులు ఎం. సత్య, కె.సూర్య వంశీ ఈ కార్యక్రమనికి ఇన్స్పైరింగ్ జేమ్స్ గా విచ్చేసి ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.పాఠశాల హెడ్ మాస్టర్ ముత్యాల చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్.

పి.వెంకటేశ్వర్లు,డిగ్రీ అకడమిక్ డైరెక్టర్

కె.సాయిరాంచౌదరి, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజేష్,హైస్కూల్ స్టాఫ్,విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement