Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ .. పెద్దిరెడ్డికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు
– మా పార్టీ నాయకులు, కార్యకర్తలను చెప్పులతో కొట్టారు
– పండుగలకూ పర్మిషన్ లంటూ వేధిస్తున్నారు

విశ్వంవాయిస్ న్యూస్, విజయవాడ:

పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ .. పెద్దిరెడ్డికి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులు

– ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు

– మా పార్టీ నాయకులు, కార్యకర్తలను చెప్పులతో కొట్టారు

– పండుగలకూ పర్మిషన్ లంటూ వేధిస్తున్నారు

– మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి, పలమనేరు డిఎస్పీ,పుంగనూరు పోలీసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్

 

పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఎపి గవర్నర్ కు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ విజ్ణప్తి చేశారు. ఆదివారం ఆయన ఎపి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి పుంగనూరులో జరుగుతున్న అరాచకాలపై ఫిర్యాదు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో పోలీసులు… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భాతర చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన అన్ని కార్యక్రమాలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్న విషయాన్ని ఆయన గవర్నర్ ద్రుష్టికి తీసుకువచ్చారు. అలాగే పోలీసులు బిసివై పార్టీ కార్యకర్తలపై చేసిన దాడికి సంబంధించిన పోటోలు, సిఐ చెప్పుతో కొట్టిన పోటోలను ఫిర్యాదుతో పాటు గవర్నర్ కు అందజేశారు. సాంప్రదాయంగా జరుపుకునే పండుగలకు కూడా అనుమతుల పేరుతో పోలీసులు వేధిస్తున్న విషయాన్ని ఆయన గవర్నర్ ద్రుష్టికి తీసుకువచ్చారు. బోడె రామచంద్రయాదవ్ ఫిర్యాదును స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారు. సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ జరిపిస్తామని తెలిపారు. అనంతరం బోడె రామచంద్రయాదవ్… రాజ్ భవన్ బయట మీడియాతో మాట్లాడారు.

గత వారం రోజుల క్రితం పుంగనూరు నియోజకవర్గంలో నియోజకవర్గస్థాయిలో రైతుల సమస్యల పైన అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టాం. ఒక ప్రైవేట్ స్థలంలో స్థల యజమాని అనుమతి తీసుకొని, అన్ని సౌకర్యాలతో ఎవరికీ ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం పోలీస్ శాఖలో ఉన్న కొంతమంది అధికారులు అక్రమంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతోపాటు పూర్తిగా అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారు. అక్కడున్న మా కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేయడంతో పాటు కార్యకర్తల పైన లాఠీచార్జి చేసి లాఠీలతో బెదిరించారు. చెప్పులతో దాడి చేశారు. పుంగనూరు నియోజకవర్గంలోనే కొంతమంది పోలీస్ అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం ఇలా చేయడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా, అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందా అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పోలీసు అధికారులు ప్రతిపక్షాలను వేధించడమే విధిగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చక్రవర్తి అన్నట్టు పెద్దిరెడ్డి సామంత రాజయినట్టు భావించి ఒక రకమైన మైకంతో వ్యవహరిస్తున్నారు. రాజకీయ నాయకుల్లాగా, వైఎస్ఆర్సిపి కార్యకర్తల్లా కొందరు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డి … ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యువ ఐపిఎస్ అధికారిగా జిల్లాకు వచ్చారని తెలియగానే జిల్లా వాసులందరూ తమకు మంచి జరుగుతుందని భావించారు. శాంతి భద్రతలు కాపాడుతారుకున్నారు. కానీ ఆయన ఒక వైసీపీ కార్యకర్తలాగ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భంట్రోతులాగ వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెడుతూ ఒక భయానక వాతావరణాన్ని స్రుష్టిస్తున్నారు. ఎస్పీ రిషాంత్ రెడ్డి… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం ఇలాంటి నీచమైన కార్యకర్తలు చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఇలాగే తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో వ్యక్తుల మీదే కాకుండా ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుదామా? అని ఎదురుచూస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చివరకు పల్లెల్లో సాంప్రదాయ బద్దంగా జరిగే పండుగలకు కూడా ఆంక్షలు విధిస్తూ ఎంతో ప్రశాంత వాతావరణం జరిగే పండుగలను కూడా పోలీసులు పెద్దిరెడ్డి మెప్పు కోసం వాడుకుంటున్నారు. అనుమతులు కావాలి, చలాన్లు కట్టాలి, డిఎస్పీ దగ్గర అనుమతి తీసుకోవాలని వేధిస్తున్నారు. పుంగనూరులో జరుగుతున్న పెద్దిరెడ్డి అరాచకాలతో పాటు పోలీసుల తీరుపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్ గారికి ఫిర్యాదు చేశాను. విచారించి చర్యలు తీసుకుంటామని వారు కూడా సానుకూలంగా స్పందించారు ” అని బోడె రామచంద్రయాదవ్ మీడియాకు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement