Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న డాక్టర్స్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

విశ్వం వాయిస్ రామచంద్రపురం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మండపేట వేదికగా జరిగిన రా కదిలి రా భారీ బహిరంగ సభకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం,మండపేట, రామచంద్రపురం నుండి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సభలో చంద్రబాబు సాక్షిగా ఆయన సమక్షంలో భారీ సంఖ్యలో పలువురు నాయకులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకొని పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ముఖ్య నేతల్లో రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ఆ పార్టీ ఇంచార్జ్ రెడ్డి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో కాకినాడ పట్టణానికి చెందిన ప్రముఖ హాస్పిటల్ సాయి రాఘవేంద్ర అధినేత డాక్టర్ కొండమూరి సత్యనారాయణ,అలాగే ద్రాక్షారామ గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు, అమృత రక్ష హాస్పిటల్స్ ద్రాక్షారామ మరియు రామచంద్రపురం అధినేత డాక్టర్ మడక రాంబాబు, ఆయన తనయుడు డాక్టర్ మడక ఎస్వి రఘువీర్ కాంత్ లు తమ అనుచర గణంతో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా డాక్టర్ మడక రాంబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నేతయని చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పాము పార్టీలోకి చేరడం జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ రాంబాబు అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి నాయకత్వంలో‌ 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం,జనసేన పార్టీకి తామంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement