Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాహుల్ భారత్ జోడో న్యాయయాత్రపై రాళ్ల దాడి దారుణం..అమానుషం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బీజేపీ ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట…

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

ఏఐసీసీ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు రాజమండ్రీ నగర, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్నటు భారత్ జోడో న్యాయ యాత్ర పై ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు చేసిన రాళ్ళ దాడిని నిరసిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమం అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

నగర అద్యక్షులు బాలేపల్లి మురళీధర్, జిల్లా అద్యక్షులు అరిగేల అరుణ కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో

వక్తలు మాట్లాడుతూ అస్సాం రాష్ట్రంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై జరిగిన దాడి అమానుషం, బీజేపీ ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేసుకునే హక్కు అన్ని పార్టీలకు ఉంటుందని, దేశ ప్రజలు ఈ దాడులను ఖండించాలని పేర్కొన్నారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీగా స్థానిక జాంపేట గాంధీ బొమ్మ నుండి అజాద్ చౌక్ వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, జ్యేష్ఠ సతీష్,తాళ్లూరి విజయ కుమార్, పెదిరెడ్ల సుబ్బారావు,మార్టిన్ లూధర్, రామానాయుడు, కాంగ్రెస్ పార్టీ హుమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్,చిన్నం మురళికృష్ణ,లీలావతి,విజయలక్ష్మి, బత్తిన చంద్రరావు,కాటం రవి, సత్యనారాయణ,కొవ్వూరి శ్రీనివాస్,బిల్డర్ బాబీ,బర్రే సుబ్రహ్మణ్యం మరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement