విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
ఫిబ్రవరి 2న విడుదల కానున్న “అంబాజీపేట మేరేజ్ బ్యాండ్ మేళం” చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని హీరో సుహాస్, హీరోయిన్ శివాని చెప్పారు. ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా చిత్ర బృందం రాజమండ్రి విచ్చేసింది. ఈ సందర్బంగా హోటల్ షెల్టాన్ లో శనివారం సాయత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హీరో సుహాస్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలయ్యాక వచ్చే ఆనందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ప్రమోషన్ వర్క్ లో భాగంగా విశాఖ,కాకినాడ చూసుకుని రాజమండ్రి వచ్చినట్లు తెలిపారు. కవల పిల్లలైన అక్కా తమ్ముడు పుట్టిన రోజు సందర్బంగా జరిగే సంఘటన ఆధారంగా వాళ్ళ జీవితాలు ఎలా మలుపు తిప్పాయన్నది చిత్ర ఇతివృత్తమని సుహాస్ చెప్పారు. యూట్యూబ్స్ లో నటించి, సినిమాల్లొ ఫ్రెండ్స్ కేరక్టర్స్, కేరక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసి, విలన్ గా చెసి,హీరోగా చేస్తున్నానని తన ప్రస్తానాన్ని వివరించారు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి సినిమాలతో పాటు దిల్ రాజు సినిమా లో నటిస్తున్నట్లు సుహాస్ చెప్పారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ ఈ చిత్రంలోఎమోషన్స్, కామెడీ, పాటలు..ఇలా అన్నీ బాగుంటాయని చెప్పారు.15నిమిషాలు సినిమా చూసాక ఆటో మెటిక్ గా సినిమాలో లీనమయిపోతారని తెలిపారు.