Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఏ ఐ ఎమ్ యస్ 10వ మహాసభలు జయప్రదం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ ద్రాక్షారామ వెంకటాయపాలెం ఫిబ్రవరి 3,4 తేదీ లో జరిగే ఏ ఐ ఎమ్ ఎస్ 10వ మహాసభ లు జయప్రదం చేయండి.ఎ కె ఎం ఎస్ పిలుపు,వెంకటాయపాలెం గ్రామం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఏ ఐ కె ఎం ఎస్ 10వ మహాసభల గోడ పత్రికా ఆవిష్కరించారు.ఏ ఐ కె ఎం ఎస్ ఉమ్మడి జిల్లా నాయకులు వి.భీమాశంకర్ మాట్లాడుతూ నేడు దేశంలో వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టింది. మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వ్యవసాయన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న సందర్భంలో ఈమహాసభలో జరుగుతున్నాయని. దేశంలో అమృతోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో వ్యవసాయం సంక్షోభం అంచులకు చేరి రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈమహాసభలు జరుగుతున్నాయని.మోడీ ప్రభుత్వం నామమాత్రంగా వున్న భూసంస్కరణలను సైతం భూస్థాపితం చేసిందని అన్నారు. భూమిలేని వారికి భూమిని పంచే భూ సంస్కరణల ఎజెండా బుట్ట దాఖలు చేసారని అన్నారు. ఆదివాసీలను అడవులు నుండి గెంటి వేయడానికి నూతన అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చిందని.ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కావాలని, దేవాదాయ,ధర్మాదాయ భూములను పేదలకు పంచాలని,రైతు ఆత్మహత్యలను అరికట్టాలని డిమాండ్ చేశారు.ఎ ఐ కె ఎం ఎస్ 10వ రాష్ట్ర మహాసభలు ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ కె ఎం ఎస్ నాయకులు ఎ.కృష్ణ, సి.హెచ్.రాజా రెడ్డి,పీ డీ ఎస్ యూ నాయకులు బి. సిద్ధూ,టీ.లక్ష్మణ్,గ్రామ రైతు కూలీ నాయకులు డీ. శ్రీను,కె.సూరిబాబు,వి. రాజేంద్ర ప్రసాద్, టీ.బాబెలు,పీ.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement