Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బదిలీపై వెళ్తున్న రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కి ఘన సత్కారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కే.శ్రీకాంత్ రెడ్డిని సత్కరించిన ప్రజా ప్రతినిధులు

పట్టణ వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

బదిలీపై వెళ్తున్న రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కి ఘన సత్కారం

 

కే శ్రీకాంత్ రెడ్డిని సత్కరించిన ప్రజా ప్రతినిధులు

 

పట్టణ వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం

 

రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు తనయుడు రామచంద్రపురం నియోజవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కె.శ్రీకాంత్ రెడ్డి గుడివాడ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా ఆయనకు ఘన విడుక్కోలు తెలుపుతూ సత్కరించారు .ఉద్యోగుల పట్ల ఆయన చూపించే విధానం అద్భుతం అన్నారు,అంకిత భావంతో పనిచేస్తూ తోటి ఉద్యోగుల పట్ల మర్యాద, ప్రేమ పూర్వకంగా ఉండేవారిని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్,మున్సిపల్ కౌన్సిలర్లు, మరియు,మున్సిపల్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

 

రామచంద్రపురం పట్టణం వీఆర్వోలచే కమిషనర్ కి సత్కారం

 

గుడివాడకు బదిలీపై వెళ్తున్న రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ కె. శ్రీకాంత్ రెడ్డి వీడ్కోలు పలుకుతూ రామచంద్రపురం పట్టణం లో 12 సచివాలయాలకు చెందిన పట్టణ విఆర్వోలు కమిషనర్ సాంబర్ లో ఘనంగా సత్కరించడం జరిగినది.సచివాలయంలో 10 శాఖలు కు చెందిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని అందులో ముఖ్యంగా రెవెన్యూ శాఖ చెందిన వీఆర్వో విధుల పట్ల వివక్షతకు తావు లేకుండా శ్రీకాంత్ రెడ్డి ఎంతో సహకరించారని రాష్ట్ర వీఆర్వో ప్రచార కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు ఏపీ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్జిల్లా ప్రధాన కార్యదర్శి,మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం కోనసీమ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ ఎమ్.బాపూజీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ వీఆర్వోల సంఘం ఉపాధ్యక్షులు పి.సాయి ప్రతిమ,పట్టణ వీఆర్వో సంఘం అధ్యక్షులు ఎన్.శేఖర్,కార్యదర్శి సత్యవతి,అధ్యక్షులు చీకట్ల వీరాంజనేయులు, ఉపాధ్యక్షులు ఎన్ సత్యనారాయణరెడ్డి, సహాయ కార్యదర్శి చిక్కాల మానస,కోశాధికారి సీతా మహాలక్ష్మితో పాటు కనకదుర్గ,నర్మదా, శిరీషా,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement