Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

దళిత సింహ గర్జన సభను జయప్రదం చేయండి జి వి హర్షకుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

రామచంద్రపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్ ద్రాక్షారామ రోడ్డులో ఉన్న శెట్టిబలిజ కళ్యాణమండపంలో, అమలాపురం మాజి పార్లమెంటు సభ్యులు జీవి హర్ష కుమార్ దళిత సింహ గర్జనకు సంబంధించి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది.ఫిబ్రవరి 11న వేమగిరిలో జరగబోయే దళిత సింహ గర్జనకు తరలిరావాలని పిలుపునిస్తూ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రద్దు పరచిన అన్ని పథకాలు తిరిగి పునరుద్ధరించాలని, అత్యాచార బాధితులు అందరికీ న్యాయం చేయాలనీ,ఈ కేసులు అన్నిటిని ప్రత్యేక కోర్టులో పెట్టాలని,సబ్ ప్లాన్ నిధులను చట్టపరంగా ఖర్చు చేయాలని,ఎస్సీల మీద పెట్టిన దొంగ కేసులు ఎత్తివేయాలని,దళిత క్రిస్టియన్ లకు ఎస్సీ హోదా కల్పించాలని, ప్రైవేట్ లో కూడా రిజర్వేషన్ పెట్టాలని, అంగన్వాడీలకు ఆశ వర్కర్లకు జీతాలు పెంచాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఎర్ర రామకృష్ణ బుంగరాజు,కాటే సుబ్రహ్మణ్యం,మాత సుబ్రహ్మణ్యం,అంబటి తుకారం,పోతుల మాధవ్, కొల్లి కృష్ణమూర్తి,జనిపెళ్ళ శోభన్,పెమ్మీ రాజకుమార్, ఆలీ హుస్సేన్,కిరణ్ కాజులూరు, రామచంద్రపురం, గంగవరం మండలం దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement