విశ్వంవాయిస్ న్యూస్, మంగళగిరి:
రాబోయే ఎన్నికల్లో మైనార్టీ బీసీల తరపున టిక్కెట్ ఇవ్వాలని అభ్యర్థన
చంద్రబాబు నాయుడుని సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం అచ్చేన్న నాయుడు
మంగళగిరి :-రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
అధ్యక్షుడు,పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడును గుంటూరు జిల్లా మంగళగిరి లోని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రపురం నియోజకవర్గం మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు నేడు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం రామచంద్రపురం నియోజకవర్గం లో సుమారు 21 బీసీ కులాలు ఉన్నాయని.వారందరి ఓటు బ్యాంకు దాదాపు 49,000 కు పైగా ఉన్నప్పటికీ నియోజకవర్గం లో బీసీ లకు సామాజిక న్యాయం జరగలేదని కావున నియోజకవర్గంలో మార్పు కొరకు మైనార్టీ బీసీ సంఘం తరుపున మరియు నేను స్తానికుడిని లోకల్ కాబట్టి నాకు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వాలని కోరారు.మైనార్టీ బీసీ సంఘం తో బాటు నియోజకవర్గం లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు మద్దతు నాకు ఉంటుందని మరియు నియోజకవర్గం లోని పరిస్టితులు ఆయనకు వివరించానని తెలిపారు.రామచంద్రపురం నియోజకవర్గంలో తాను గత 12 సంవత్సరాలు నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు,ప్రజా పోరాట కార్యక్రమాలు మా సంఘం సభ్యులు సహకారంతో చేశామని.మాది రాజకీయ కుటుంబం అని.మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.అచ్చెన్నాయుడు స్పందించి రామచంద్రపురం నియోజకవర్గం టికెట్ విషయం గురించి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రలో పది లక్షలు జనాభా కలిగి ఉన్న బెస్తా,గంగపుత్ర కుల సంఘాలు తమకు మద్దతు ఇచ్చారని తెలిపారు.